200MP Camera Phone: 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... మొదట లాంచ్ చేసే కంపెనీ ఇదే.. ఎప్పుడు వస్తుందంటే?
200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొదటి స్మార్ట్ ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2022 జూన్ లోపల ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. శాంసంగ్ తన 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది. ఇది పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. మోటొరోలాతో పాటు షియోమీ కూడా వచ్చే సంవత్సరం 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్ లాంచ్ చేయనుంది. ఇక శాంసంగ్ 2023లో 200 మెగాపిక్సెల్ కెమెరాను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
ప్రపంచంలో మొట్టమొదటి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌ను మోటొరోలా లాంచ్ చేయనుందని ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. 2022 ప్రథమార్థంలో మోటొరోలా, 2022 ద్వితీయార్థంలో షియోమీ, 2023లో శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఈ విషయాన్ని ఏ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. శాంసంగ్ 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పీ1 సెన్సార్‌లో 0.64 మైక్రాన్ పిక్సెల్స్‌ను అందించనున్నారు. కెమెలియన్ సెల్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది. టూ బై టూ, ఫోర్ బై ఫోర్ లేదా ఫుల్ పిక్సెల్ లేఅవుట్‌ను ఇది ఉపయోగించుకోనుంది. దీని ద్వారా వినియోగదారులు 12.5 నుంచి 200 మెగాపిక్సెల్ రిజల్యూషన్స్ మధ్యలో ఫొటోలు తీసుకోవచ్చు.
200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు మోటొరోలా ఎడ్జ్ ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 60 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ60ఏ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను ఉపయోగించనున్నారు. దీంతోపాటు ఇందులో 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ కెమెరాను ప్రధాన కెమెరాగా అందించనున్నట్లు తెలుస్తోంది.
మోటొరోలా ఎడ్జ్ ఎక్స్‌ను కంపెనీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ టెనా లిస్టింగ్‌లో కూడా గత వారమే కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని తెలుసుకోవచ్చు.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!