![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Moto G71 5G: రూ.19 వేలలోపే 5జీ ఫోన్.. ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ మోటో జీ71 5జీని లాంచ్ చేసింది.
![Moto G71 5G: రూ.19 వేలలోపే 5జీ ఫోన్.. ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా! Moto G71 5G Launched Check Price Specifications Features and More Moto G71 5G: రూ.19 వేలలోపే 5జీ ఫోన్.. ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/30/1e7c23fa24f5ec743c0dc4c4e68ada76_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మోటొరోలా తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ మోటో జీ71 5జీని చైనాలో లాంచ్ చేసింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది.
మోటో జీ71 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 1,699 యువాన్లుగా(సుమారు రూ.18,900) ఉంది. నెబ్యులా గ్రీన్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
మోటో జీ71 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది.
డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్, 5జీ సపోర్ట్, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఇందులో ఐపీ52 రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా అందించారు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)