Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!
ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది.
Most Sold Phone: ఒకప్పుడు మొబైల్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన నోకియా ఎంత ఆధిపత్యం సాధించిందో తెలిసిందే. నోకియా 1100 ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 మిలియన్ (25 కోట్లు) యూనిట్లు అమ్ముడయ్యాయి. నోకియా 1100 2003లో లాంచ్ అయింది. అత్యంత మన్నికైన మొబైల్‌గా మార్కెట్‌లో దీనికి చాలా మంచి పేరు ఉండేది. తక్కువ ధర, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ కారణంగా దాని డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరిగింది.
నోకియా 1100 ప్రత్యేక ఫీచర్లు
నోకియా 1100లో మోనోక్రోమ్ డిస్‌ప్లే ఉండేది. కాంపాక్ట్, తేలికైన డిజైన్‌తో క్యాండీ-బార్ స్టైల్‌లో దీన్ని రూపొందించారు. ఇది 96 x 65 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఉన్న చిన్న స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు కీ ప్యాడ్‌ని ఉపయోగించి ఫోన్ మెనుని నావిగేట్ చేయవచ్చు. ఫోన్‌లో ఫ్లాష్‌లైట్ ఉంది. దీని బ్యాటరీ ఏకంగా 400 గంటల స్టాండ్‌బై టైమ్, నాలుగు గంటల టాక్ టైమ్‌ని అందిస్తుంది.
నోకియా 1100 ఎందుకు ఎక్కువ అమ్ముడైంది?
నోకియా 1100 విజయవంతం కావడానికి ఒక కారణం కంపెనీ బేసిక్స్‌పై దృష్టి పెట్టడం. ఇది ఉపయోగించడానికి సులభమైన పరికరం. వినియోగదారులు కాల్‌లు చేయడానికి, SMS పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి, రిమైండర్‌లు, అలారంలను సెట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇందులో కాలిక్యులేటర్, స్టాప్‌వాచ్, క్యాలెండర్ వంటి అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇన్ని యూనిట్లు అమ్ముడు పోవడానికి మరో ఒక కారణం దాని ధర. నోకియా 1100 ధర చాలా రీజనబుల్‌గా ఉండేది.
భారతదేశంలో నోకియా 1100 ధర
నోకియా 1100 ప్రపంచవ్యాప్తంగా 2003లో లాంచ్ అయింది. కానీ భారతదేశంలో మాత్రం దీని లాంచ్ 2005లో జరిగింది. ఆ సమయంలో దీని ధర దాదాపు రూ. నాలుగు వేల నుంచి రూ. ఐదు వేల మధ్యలో ఉండేది. కాలక్రమేణా, నోకియా 1100 ధర మరింత తగ్గిపోయింది. ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఫోన్‌లలో ఒకటిగా మారింది.
మొత్తం మీద నోకియా 1100 విజయానికి దాని సరళమైన డిజైన్, మన్నిక అయిన బిల్డ్ క్వాలిటీ, చవకైన ధర కారణమని చెప్పవచ్చు. ఇది తక్కువ ధరలో బేసిక్ ఫంక్షన్స్, సెక్యూరిటీని అందించే ఫోన్. దీని కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram