అన్వేషించండి

Xiaomi 12T: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - అక్టోబర్‌లో లాంచ్- ధర కూడా లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన 12టీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

షావోమీ 12టీ సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి. షావోమీ 12టీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. షావోమీ 12టీ ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఈ డేటాబేస్‌లో కనిపించిందని తెలుస్తోంది. ఇందులో 3.19 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ చిప్‌సెట్ ఉండనుంది. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ అని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించనున్నారు. షావోమీ 12టీ ప్రోలో 12 జీబీ వరకు ర్యామ్ ఉండనుంది.

షావోమీ స్మార్ట్ ఫోన్ 22081212UG మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కనిపించింది. ఇది షావోమీ 12టీ ప్రో గ్లోబల్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 1,300 పాయింట్లు, మల్టీకోర్ టెస్టులో 4061 పాయింట్లను సాధించింది. ఇదే వెబ్‌సైట్ సింగిల్ కోర్ టెస్టులో 753 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 2,990 పాయింట్లను షావోమీ 12టీ సాధించింది.

షావోమీ 12టీ ప్రో అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్లోంది. దీని ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. షావోమీ 12టీ ధర 649 యూరోలుగానూ (సుమారు రూ.51,500), షావోమీ 12టీ ప్రో ధర 849 యూరోలుగానూ (సుమారు రూ.67,000) ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా (సుమారు రూ.1,06,200) ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,18,000), 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,41,600) నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 8.02 అంగుళాల మెయిన్ ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు. అవుటర్ డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. వెనకవైపు కెమెరా సెటప్‌ను సమాంతరంగా అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget