By: ABP Desam | Updated at : 11 Apr 2022 04:15 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై15ఎస్ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించారు. (Image: Credits Vivo)
వివో ఇటీవలే మనదేశంలో వై15ఎస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధరను వివో తగ్గించింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ విభాగంలో మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.10,990గా ఉంది.
వివో వై15ఎస్ ధర, తగ్గింపు
ఈ స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.10,990గా నిర్ణయించారు. ఇప్పుడు రూ.500 తగ్గింపుతో రూ.10,490కు అందుబాటులో ఉంది. ఇందులో కేవలం 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. మిస్టిక్ బ్లూ, వేవ్ గ్రీన్ రంగుల్లో వివో వై15ఎస్‌ను కొనుగోలు చేయవచ్చు.
వివో వై15ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా... బరువు 179 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?