News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo X Fold S: వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తుంది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

వివో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలోనే లాంచ్ చేసింది. ఇప్పుడు దాని తర్వాతి వెర్షన్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధం అవుతోంది. దీనికి వివో ఎక్స్ ఫోల్డ్ ఎస్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. వివో ఎక్స్ ఫోల్డ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. రెడ్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, స్టోరేజ్, ర్యామ్, కెమెరాలు ఎక్స్ ఫోల్డ్ తరహాలోనే ఉండనున్నాయి. సెప్టెంబర్‌లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందా, ఎప్పుడు లాంచ్ కానుంది అనే వివరాలు తెలియరాలేదు.

వివో ప్రత్యర్థి బ్రాండ్ షావోమీ ఇటీవలే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా (సుమారు రూ.1,06,200) ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,18,000), 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,41,600) నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8.02 అంగుళాల మెయిన్ ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2,160x1,914 పిక్సెల్స్‌గా ఉంది. అవుటర్ డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.

ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. వెనకవైపు కెమెరా సెటప్‌ను సమాంతరంగా అందించారు. ఈ ఫోన్ బరువు 262 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 27 Aug 2022 08:04 PM (IST) Tags: Vivo New Phone Vivo Vivo X Fold S Launch Vivo X Fold S Vivo X Fold Vivo New Foldable Phone

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్