అన్వేషించండి

Top Mobile Launches of 2024: 2024లో మనదేశంలో లాంచ్ అయిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు - యాపిల్ నుంచి రెడ్‌మీ వరకు!

Top Mobiles in 2024: 2024లో మనదేశంలో చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో యాపిల్ ఐఫోన్ 16, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ వంటి స్మార్ట్ ఫోన్ సిరీస్‌లు ఉన్నాయి.

Best Smartphones in 2024: ఈ సంవత్సరం మనదేశంలో చాలా స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో సక్సెస్ అయ్యి ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేసిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం కొనుగోళ్ల పరంగానే కాకుండా ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇవి బెస్ట్ స్మార్ట్ ఫోన్లుగా నిలిచాయి. ఆ స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 16 సిరీస్ (iPhone 16 Series)
యాపిల్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండో మంగళవారం నాడు తన కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేస్తుంది. అలాగే ఈసారి మార్కెట్లోకి ఐఫోన్ 16 సిరీస్ వచ్చింది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు ధరల రేంజ్‌లో మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ మోడల్ అయిన ఐఫోన్ 16 ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ మోడల్ అయిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,44,900 నుంచి మొదలవనుంది. కాబట్టి ఐఫోన్లను రూ.80 వేల నుంచి ఏ ధర రేంజ్‌లో కావాలంటే ఆ రేటులో కొనుగోలు చేయవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ (Google Pixel 9 Series)
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో మూడు స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, సూపర్ కెమెరాలకు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల సిరీస్ పెట్టింది పేరు. ప్రారంభ మోడల్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ధర రూ.79,999 నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ మోడల్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర రూ.1,24,999గా ఉంది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ (Samsung Galaxy S24 Series)
శాంసంగ్ ప్రతి సంవత్సరం తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల సిరీస్‌ను లాంచ్ చేస్తుంది. ఈ సంవత్సరం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ మోడల్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర రూ.62,999 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా టాప్ వేరియంట్ ధర రూ.1,21,999గా ఉంది.

రెడ్‌మీ నోట్ 14 సిరీస్ (Redmi Note 14 Series)
ఈ లిస్ట్‌లో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే. ఇందులో రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో, రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో రెడ్‌మీ నోట్ 14 ధర రూ.17,999 నుంచి, రెడ్‌మీ నోట్ 14 ప్రో ధర రూ.23,999 నుంచి రెడ్‌మీ నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెలలోనే ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి.

వివో వీ40 సిరీస్ (Vivo V40 Series)
వివో ఈ సంవత్సరం లాంచ్ చేసిన మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో వివో వీ40 సిరీస్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో వివో వీ40, వివో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో వీ40 ధర రూ.34,999 కాగా, వీ40 ప్రో ధర రూ.49,999 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget