By: ABP Desam | Updated at : 24 Jul 2022 07:13 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టెక్నో కొత్త ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.
టెక్నో కామోన్ 19 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. వెనకవైపు 64 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
టెక్నో కామోన్ 19 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఎకో బ్లాక్, జియోమెట్రిక్ గ్రీన్, సీ సాల్ట్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
టెక్నో కామోన్ 19 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. పంచ్ హోల్ డిజైన్, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
Realme C33: రూ.10 వేలలోపే రియల్మీ కొత్త బడ్జెట్ ఫోన్ - 128 జీబీ వరకు స్టోరేజ్!
Infinix Smart 6 HD: రూ.7 వేలలోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ - 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో!
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!
Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?
Realme 9i 5G: రియల్మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్