(Source: ECI/ABP News/ABP Majha)
Sony Xperia 1 IV: యాపిల్‌కే పోటీనిచ్చే ఫోన్ తెచ్చిన సోనీ - అదిరిపోయే ఫీచర్లు, సూపర్ కెమెరాలు - ధర ఎంతో చూశారా?
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ సోనీ తన కొత్త ఫ్లాగ్ షిప్ సిరీస్‌ను లాంచ్ చేసింది. అవే సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ, 1 ఐవీ.
సోనీ తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎక్స్‌పీరియా 1 ఐవీని లాంచ్ చేసింది. ట్రూ జూమ్ సామర్థ్యం ఉన్న కొత్త తరహా టెలిఫొటో లెన్స్‌ను ఇందులో అందించారు. కంటెంట్ క్రియేషన్ పవర్‌హౌస్‌గా సోనీ ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇమేజింగ్, గేమింగ్, మ్యూజిక్ ఇలా అన్నిట్లోనూ అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు లేటెస్ట్ టెక్నాలజీలను అందించారు. కంటెంట్ క్రియేషన్‌లో ప్రతి ఒక్క విభాగాన్ని ఈ ఫోన్ ద్వారా హ్యాండిల్ చేయవచ్చని సోనీ తెలిపింది. దీంతోపాటు సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ అనే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయింది.
సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ ధర
ఈ ఫోన్ ధరను అమెరికాలో 1,599 డాలర్లుగా (సుమారు రూ.1,23,500) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సేల్ సెప్టెంబర్ నుంచి జరగనుంది. అమెరికాలో ఈ ఫోన్‌ను అధికారిక సెల్లర్లు, కంపెనీ వెబ్ సైట్లో కొనుగోలు చేయవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. బ్లాక్, పర్పుల్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ ధర
ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను అమెరికాలో 499 డాలర్లుగా (సుమారు రూ.38,500) నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ నుంచి జరగనుంది.ఆగ్నేయాసియా దేశాల్లో ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. బ్లాక్, లావెండర్, మింట్, వైట్ రంగుల్లో సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ కొనుగోలు చేయవచ్చు.
సోనీ ఎక్స్‌పీరియా 1 ఐవీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల 4కే హెచ్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని బెజెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏకంగా 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. ఇందులో ఉన్న గేమ్ ఎన్‌హేన్సర్ ఆప్షన్ ద్వారా గేమ్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇందులో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది. స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. అంటే పూర్తి స్థాయి ప్యూర్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు 12 మెగాపిక్సెల్ ఎక్స్‌మోర్ ఆర్ ఇమేజ్ సెన్సార్లను అందించారు. వీటిలో ఒకటి 16 ఎంఎం అల్ట్రా వైడ్ లెన్స్ కాగా... 24 ఎంఎం వైడ్ లెన్స్, 85-125 ఎంఎం టెలిఫొటో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.
సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
సోనీ ఎక్స్‌పీరియా 10 ఐవీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. ఇందులో ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1 వైర్‌లెస్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
View this post on Instagram