అన్వేషించండి

Samsung Galaxy F23 5G Copper Blush: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్‌లో కాపర్ బ్లష్ అనే కొత్త కలర్ వేరియంట్ మనదేశంలో లాంచ్ చేసింది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చిలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో కాపర్ బ్లష్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. కేవలం రంగులో తప్ప, మిగతా విషయాల్లో దీనికి, ముందు వెర్షన్‌లకు ఎటువంటి తేడాలు లేవు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ధర
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. గతంలో ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు కాపర్ బ్లష్ రంగులో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే... రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంటే 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.15,999కు, 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చన్న మాట.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే ప్యానెల్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా అందించారు.

6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ పనిచేయనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను శాంసంగ్ అందించింది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget