Samsung F13: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - లాంచ్ త్వరలోనే!
శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది.
శాంసంగ్ తన ఎఫ్-సిరీస్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13. ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ పేజీ కూడా శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లో చూడవచ్చు. సపోర్ట్ పేజీ కనిపించింది కాబట్టి లాంచ్ కూడా అతి త్వరలోనే ఉందనుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ పేజీలో దీని డిజైన్ కూడా రివీల్ అయింది. ఈ ఫోన్ ఇటీవలే గీక్ బెంచ్ వెబ్ సైట్లో కూడా కనిపించింది. గతంలో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 డిజైన్ ప్రకారం చూస్తే ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీర్ఘచతురస్రాకారంలో ఈ కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.
గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం... ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 157 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 587 పాయంట్లను ఈ ఫోన్ సాధించింది.
శాంసంగ్ ఎం13 స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లుగా ఉండగా... బరువు 192 గ్రాములుగా ఉంది.
స్మార్ట్ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. 4 జీబీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!