By: ABP Desam | Updated at : 22 May 2023 04:58 PM (IST)
శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ( Image Source : Samsung )
Samsung Galaxy A14: శాంసంగ్ గెలాక్సీ ఏ14 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సోమవారం లాంచ్ అయింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లో ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. గతేడాడది వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఏ13కు తర్వాతి వెర్షన్‌గా ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌కు రెండు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ రానున్నాయి. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు. బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎస్‌బీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే శాంసంగ్ రూ.1,000 డిస్కౌంట్ అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ14 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆక్టా కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, 3.5 ఎంఎం జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. యాక్సెలరోమీటర్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ ఎనేబుల్ చేస్తే 52 గంటల టాక్ టైంను ఇది అందించనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాకప్‌ను ఇది అందించనుంది. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 201 గ్రాములుగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. 5ఎన్ఎం ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో ఏకంగా 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను రూ.13,490గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,990గా ఉంది. బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!
Redmi K50i 5G Offer: రెడ్మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్
Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్