అన్వేషించండి

Redmi Note 12 Pro New Model: రెడ్‌మీ నోట్ 12 ప్రోను అప్‌గ్రేడ్ చేసిన కంపెనీ - ఇంతకీ ఏం మారింది?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ‌్‌ను రెడ్‌మీ నోట్ 12 ప్రో సపోర్ట్ చేయనుంది. అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 12 ప్రో ధర ఎంత?
ఇందులో గతంలో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గానూ ఉంది.

ఇప్పుడు తాజాగా లాంచ్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.28,999కు విక్రయించారు. మిడ్‌నైట్ డార్క్, టైమ్ బ్లూ, మిర్రర్ పోర్స్‌లెయిన్ వైట్, షాలో డ్రీమ్ గెలాక్సీ రంగుల్లో రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నోట్ 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ ఫార్మాట్‌ను రెడ్‌మీ నోట్ 12 ప్రో సపోర్ట్ చేయనుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 12 ప్రో పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా షావోమీ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

మరోవైపు రెడ్‌మీ కే50ఐ 5జీ స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో భారీ తగ్గింపు ఆఫర్ అందించారు. రూ.25,999 ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై ఏకంగా రూ. ఏడు వేల ధర తగ్గింపును లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

రెడ్‌మీ కే50ఐ 5జీ ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, దీన్ని రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు అందించే డిస్కౌంట్‌తో కలిపితే రూ.18,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చని కంపెనీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. క్విక్ సిల్వర్, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో రెడ్‌మీ కే50ఐ 5జీ కొనుగోలు చేయవచ్చు.

Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?

Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget