(Source: ECI/ABP News/ABP Majha)
Realme Narzo 50i Prime: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ రియల్‌మీ ఫోన్ చూడండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్.
రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 1 టీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డును ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్లూ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతోనే లాంచ్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ వెనకబడిందని చెప్పవచ్చు.
రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఇది కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే. రెగ్యులర్ యూజర్లకు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 10W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా అందించారు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 182 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram