Realme GT Neo 3: అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మీ కొత్త గేమింగ్ ఫోన్ - ఐదు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 3.
రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక గేమింగ్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో 6.7 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 150W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
రియల్‌మీ జీటీ నియో 3 ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గా ఉంది. ఇక 150W మోడల్‌లో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా నిర్ణయించారు. మే 4వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మీ జీటీ నియో 3 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 1000 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.
ఇందులో రెండు బ్యాటరీ మోడల్స్ ఉన్నాయి. వీటిలో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ మోడల్లో 150W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అందించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ 50 శాతం ఎక్కడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఇక 5000 ఎంఏహెచ్ మోడల్లో 80W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ శాంసంగ్ ఎస్5కే3పీ9 సెన్సార్‌ను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డాల్బీ అట్మాస్ ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?