News
News
X

ఈ రియల్‌మీ ఫోన్ వాడేవారికి గుడ్‌న్యూస్

రియల్‌మీ 9 5జీ స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్ అందించారు.

FOLLOW US: 

రియల్‌మీ 9 5జీ స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంను అందించారు. RMX3388_11.C.03 యూఐ వెర్షన్ నంబర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మెరుగైన డిజైన్, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, రీవ్యాంప్ చేసిన హోం పేజీ లేఅవుట్‌ను ఇందులో అందించారు. క్విక్ లాంచ్, క్వాంటం యానిమేషన్ ఇంజిన్ 3.0, బ్యాక్‌గ్రౌండ్ స్ట్రీమ్ మోడ్‌లు కూడా ఉండనున్నాయి. కొత్త ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను ఈ అప్‌డేట్ ద్వారా అందించనున్నారు.

రియల్‌మీ 9 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా ప్రస్తుతం రూ.15,999గానే ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐల క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే రూ.13,499కే ఈ ఫోన్ దక్కించుకోవచ్చన్న మాట. మీటియోర్ బ్లాక్, స్టార్ గేజ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ 9 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ... పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్‌గానూ ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా 11 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డును అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 188 గ్రాములుగా ఉంది.

News Reels

ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మోనోక్రోమ్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, మాక్రో కెమెరాలు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సెలరోమీటర్ ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 24 Sep 2022 05:11 PM (IST) Tags: Realme Android 12 Realme 9 5G Realme New Phone Realme 9 5G Android 12

సంబంధిత కథనాలు

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు