Realme 9 4g Specifications: 108MP కెమెరాతో రియల్‌మీ 4G మొబైల్ భారత్‌లో లాంచ్ - ధర, పూర్తి ఫీచర్లు ఇవే
Realme 9 4g Specifications: Super AMOLED డిస్‌ప్లే, ఏకంగా 108MP కెమెరా మొబైల్‌ను లాంచ్ చేసింది రియల్ మీ. తాజాగా లాంచ్ అయిన రియల్ మీ 4జీ ధర, ఫీచర్లు వివరాలు మీ కోసం..
Realme 9 4g Sale Starts In India: మరో కొత్త మొబైల్ సిరీస్ తీసుకొచ్చింది రియల్ మీ. మంగళవారం నాడు రిలీజ్ చేసిన మొబైల్‌లో ఏకంగా 108MP కెమెరా ఇవ్వడం ప్లస్ పాయింట్. Super AMOLED డిస్‌ప్లే ఉన్న ఈ మొబైల్ మంగళవారం నాడు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ప్రస్తుతం తీసుకొచ్చింది ఈ మోడల్‌లో 6వ హ్యాండ్ సెట్. ఇదివరకు రియల్ మి 9i, రియల్ మి 9 5జీ, రియల్ 9 5జీ స్పీడ్ ఎడిషన్, రియల్ మి 9 ప్రో + 5G రాగా, తాజాగా రియల్ మీ 9 4జీ మోడల్స్ లాంచ్ చేసింది.
స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 5000MAH, 90HZ రిఫ్రెష్ రేట్, రియల్ మి యూఐ 3.0తో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా రియల్‌మీ 4జీ మొబైల్‌ను రూ.2. వేలు డిస్కౌంట్‌తో లాంచ్ చేశారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఉపయోగించుకొని వర్చువల్‌గా ర్యామ్(RAM)ను పెంచుకునే వీలుంది. రియల్‌మీ 9 4జీ మొబైల్ మోడల్స్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.
రియల్‌మీ 9 4G ఫీచర్లు ఇవే.. (Realme 9 4g Specifications)
ఇందులో రెండు ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 6GB RAM + 128GB వేరియంట్ కాగా, రెండోది 8GB RAM + 128GB.
6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ Super AMOLED డిస్‌ప్లే
90HZ రిఫ్రెష్ రేట్
360HZ శాంప్లింగ్ రేట్
ఆక్టా కోర్ట క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్
డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీ (Dynaminc RAM Expansion). దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ర్యామ్‌ను మరో 5 5G ర్యామ్ వరకు పెంచుకునే వీలుంది
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 12
ట్రిపుల్ రియర్ కెమెరాలు. అందులో ఒకటి 108MP ప్రొలైట్ కెమరా, శాంసంగ్ ఐసో సెల్ HM6 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్
5000MAH బ్యాటరీ
33W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్
టైప్ c ఛార్జింగ్ పోర్ట్
మెమరీ కార్డుకు ప్రత్యేక స్లాట్
ఓవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్
3.5mm ఆడియో జాక్
4జీ ఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ 5.1
రియల్‌మీ 4జీ ధర, ఆఫర్స్ (Realme 9 4G Price)
రియల్‌మీ 9 4జీ మొబైల్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.17,999 ఉండగా.. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 18,999 ఉంది. ఫ్లిప్‌కార్డ్, రియల్‌మీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వినియోగదారులు ఈ మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు. స్టార్‌గేజ్ వైట్, మీటియర్ బ్లాక్, సన్‌బర్ట్స్ గోల్డ్ ఈ మూడు రంగుల్లో మొబైల్ లభ్యం అవుతోంది. HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారికి, ఈఎంఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్ పోర్టల్‌లో ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Oppo F21 Pro: ఒప్పో ఎఫ్21 ప్రో వచ్చేసింది - అదిరిపోయే డిజైన్, సూపర్ కెమెరా - ధర ఎంతంటే?
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?