News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Realme 11 Pro+: రూ.24 వేల లోపే 200 మెగాపిక్సెల్ కెమెరా లాంచ్ చేసిన రియల్‌మీ - ప్రారంభ ఆఫర్లు అదుర్స్!

రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

FOLLOW US: 
Share:

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 11 ప్రో ప్లస్. ఈ ఫోన్‌లో కంపెనీ ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రియల్‌మీ 11 ప్రో ప్లస్ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది.

దీనికి సంబంధించిన ఎర్లీ బర్డ్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సేల్‌లో వినియోగదారులకు రియల్‌మీ రూ.2,000 తగ్గింపు అందించనున్నారు. దీంతో పాటు రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.24 వేల లోపే రియల్‌మీ 11 ప్రో ప్లస్‌ను కొనుగోలు చేయవచ్చన్న మాట. ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్‌రైజ్ బీజ్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.

రియల్‌మీ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో అందించారు. ఈ మొబైల్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ ఈ ఫోన్‌లో అందించింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

రియల్‌మీ 11 ప్రో కూడా దీంతోపాటే లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ కొనాలంటే రూ.27,999 పెట్టాల్సిందే.

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.

ఫోన్ వెనకవైపు 100 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Published at : 08 Jun 2023 08:55 PM (IST) Tags: Realme Realme New Phone Realme 11 Pro Plus Realme 11 Pro Plus Price in India Realme 11 Pro Plus Launched Realme 11 Pro Plus Specifications Realme 11 Pro Plus Features

ఇవి కూడా చూడండి

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది