అన్వేషించండి

Realme 10 Pro Plus 5G: రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేసింది - శాంసంగ్, ఐకూ, మోటొరోలా టాప్ ఫోన్లతో పోటీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ.

రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ కెమెరాను శాంసంగ్ రూపొందించడం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఐకూ జెడ్6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ, మోటొరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.25,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గానూ నిర్ణయించారు. డార్క్ మేటర్, హైపర్ స్పేస్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 14వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ 2160 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 93.65 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 4 సెంటీమీటర్ల మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W సూపర్‌వూక్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ 10 ప్రో ప్లస్ ద్వారా చార్జింగ్ చేస్తే కేవలం 47 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by realme India (@realmeindia)

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget