OnePlus Ace 2 Pro: 24 జీబీ ర్యామ్‌తో రానున్న వన్‌ప్లస్ కొత్త ఫోన్ - ల్యాప్‌టాప్‌ల్లో కూడా ఇంత ఉండదుగా!
వన్‌ప్లస్ త్వరలో లాంచ్ కానున్న ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 24 జీబీ వరకు ర్యామ్ ఉండనుందని తెలుస్తోంది.
OnePlus Ace 2 Pro: వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి ఇది ప్రో వెర్షన్. వన్‌ప్లస్ ఏస్ 2లో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ ఏస్ 2 సపోర్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రోలో దీనికి సంబంధించిన అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయి.
ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌తో...
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ ఛాట్ స్టేషన్ వీబో పోస్ట్ ప్రకారం వన్‌ప్లస్ 2 ప్రోలో ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. వన్‌ప్లస్ ఏస్ 2లో అందించిన ప్రాసెసర్ కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్.
24 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్
24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. దీని మినిమం ర్యామ్ వేరియంట్‌నే 16 జీబీ ఉండనుందట. ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ ఓఎస్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో పని చేయనుందని తెలుస్తోంది.
ఫీచర్లు ఇవే...
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... 6.7 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్, 2 మెగాపిక్సెల్ గెలాక్సీ కోర్ మాక్రో లెన్స్ ఉండనున్నాయి. వన్‌ప్లస్ ఏస్ ప్రో స్మార్ట్ ఫోన్‌ను వన్‌ప్లస్ 10టీగా మనదేశంలో విడుదల చేశారు. అలాగే వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో కూడా వన్‌ప్లస్ 11టీగా భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 3 కూడా వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఇది ఒక మీడియం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. కచ్చితంగా ఏరోజు లాంచ్ అవుతుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్‌లోని ఒక టీజర్ పోస్ట్ ప్రకారం భారతదేశం, యూరప్, ఆసియా పసిఫిక్ దేశాల్లో OnePlus Nord 3 లాంచ్ కానుందని అర్థం చేసుకోవచ్చు. అయితే కంపెనీ స్మార్ట్‌ఫోన్ పేరును కూడా ఇంకా వెల్లడించలేదు.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
డిస్‌ప్లే: 6.74 అంగుళాల 1.5K అమోఎల్ఈడీ డిస్‌ప్లే (120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్)
వెనుక కెమెరా: 50MP ప్రధాన కెమెరా + 8MP సెకండరీ సెన్సార్ + 2MP తృతీయ సెన్సార్
సెల్ఫీ కెమెరా: సెల్ఫీలు తీసుకోవడానికి ముందువైపు 16MP కెమెరా
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9000
స్టోరేజ్: 8 జీబీ/12 జీబీ/16 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
బ్యాటరీ: 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 13 టాప్ లెవల్‌లో ఆక్సిజన్‌ఓఎస్ 13తో అందుబాటులో ఉంటుంది.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?