iOS 16లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ - అప్‌డేట్ చేసేముందు జరభద్రం!
ఐవోఎస్ 16కు అప్‌గ్రేడ్ చేసిన స్మార్ట్ ఫోన్లకు బ్యాటరీ సమస్యలు వస్తున్నాయని సమాచారం.
![iOS 16లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ - అప్‌డేట్ చేసేముందు జరభద్రం! Old iPhone Users Complaining Battery Drowning Issues After Updating to iOS 16 iOS 16లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ - అప్‌డేట్ చేసేముందు జరభద్రం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/30/f003029891f0bd537342eb6dd760e1fd1664539302801252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యాపిల్ ఈ నెలలో ఐఫోన్‌ల కోసం iOS 16 అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొన్ని పాత ఐఫోన్‌లలో కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చి రెండు వారాలు పైనే అయింది. కొత్త iOS లాక్ స్క్రీన్‌కు విజువల్ ఛేంజెస్‌ను తీసుకు వస్తుంది. అలాగు ఆపరేటింగ్ సిస్టంకు కొన్ని నిఫ్టీ ఫీచర్‌లను జోడిస్తుంది. అయితే ఐవోఎస్ 16 లాంచ్ అయినప్పటి నుంచి చాలా మంది వినియోగదారులు తమ ఐఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ పడిపోయిందని కంప్లయింట్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ గురించి మరిన్ని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, కొత్త ఆపరేటింగ్ సిస్టం విడుదలై రెండు వారాలు గడిచినా యాపిల్ ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించనట్లు కనిపిస్తోంది.
ఐఫోన్ X నుంచి ఐఫోన్ 13 వరకు అన్ని పాత ఐఫోన్‌లలో కొత్త iOS 16ని ఇన్‌స్టాల్ చేసిన వారిలో చాలా మంది బ్యాటరీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాటరీ జీవితం గురించి మొదట్లో వినియోగదారులు ఫిర్యాదులు చేస్తారని టెక్ నిపుణులు ఊహించిందే. కానీ Apple త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. గతంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు యాపిల్ వేగంగా స్పందించింది. కానీ ఇప్పటికీ అలా చేయలేదని తెలుస్తోంది. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో iOS 16 బ్యాటరీ రివ్యూలు చాలా వరస్ట్‌గా ఉన్నాయి.
Redditలోని కొంతమంది ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ వినియోగదారులు తమ స్క్రీన్-ఆన్-టైమ్ బాగా తగ్గించబడిందని పేర్కొన్నారు. ఇది iOS 16కి మారిన తర్వాత 11-12 గంటల నుండి 7 గంటల వరకు తగ్గిందని ఫిర్యాదు చేస్తున్నారు. దీనితో పాటు వినియోగదారులు మరిన్ని బగ్‌లను కూడా గుర్తించారు. వీటిని Apple ఇంకా పరిష్కరించలేదు.
ఆపిల్ తన కొత్త iOS మొదటి వెర్షన్‌ను ప్రతి సంవత్సరం వదులుతున్నప్పుడు బ్యాటరీ లైఫ్ కంప్లయింట్స్ తరచుగా వచ్చేవే. కానీ కొత్త అప్‌డేట్స్‌తో బ్యాటరీ సమస్యలు సాల్వ్ అవుతాయి. అయితే ఇప్పుడు Apple రెండు అప్‌డేట్స్ అందించినా బ్యాటరీ లైఫ్ సమస్య పరిష్కారం కాలేదు.
పాత ఐఫోన్‌లలోని బ్యాటరీ సమస్యలను పరిష్కరించే అప్‌డేట్‌ను Apple అందిస్తుందని వినియోగదారులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు iOS 16.1, iOS 16.2 అనే రెండు అప్‌డేట్‌లను యాపిల్ విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లు కూడా బ్యాటరీ సమస్యను పరిష్కరించలేదు.
ఐవోఎస్ 16 ద్వారా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా అందించారు. ఫోకస్ మోడ్, కొత్త లాక్ స్క్రీన్‌లతో పాటు హైడ్ చేసిన లేదా తాజాగా డిలీట్ చేసిన ఆల్బమ్స్‌కు మరింత ప్రైవసీని కల్పించారు. ఐమెసేజెస్, షేర్ ప్లే, నోటిఫికేషన్లు, మ్యాప్స్, సఫారీ, వాలెట్ వంటి వాటికి మరిన్ని ఫీచర్లు అందించారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)