WhatsApp: టైపింగ్ అవసరం లేకుండానే చాట్ చేయొచ్చు, వాట్సాప్‌లో కొత్త ఫీచర్ గురించి తెలుసా?
3.5 బిలియన్లకుపైగా వినియోగదారులు కలిగి ఉన్న వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన యాప్‌గా మారింది. అందుకే ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఫీచర్స్ తీసుకొస్తోంది.

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకుపైగా వినియోగదారులతో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్. మొబైల్స్‌లో ఏ యాప్ లేకపోయినా వాట్సాప్ ఉండాల్సిందే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ గంటకోసారి అయినా చూస్తున్నారు జనాలు. ఇన్‌స్టెంట్ మెసేజ్‌ల అయిన WhatsApp తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక గ్రూప్ చాట్‌లలో టైపింగ్ శ్రమ అక్కర్లేదు. WhatsApp గ్రూప్ వాయిస్ చాట్ అనే కొత్త టూల్‌ను ప్రారంభించింది, దీని ద్వారా చాటింగ్ సులభం ఆహ్లాదకరంగా మారనుంది.
టైప్ చేయాల్సిన అవసరం లేదు
గ్రూప్‌లో పొడవైన సందేశాలను టైప్ చేయడం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి WhatsApp ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు గ్రూప్ చాట్‌లో నేరుగా మీ గొంతుతో మాట్లాడవచ్చు, అది కూడా హ్యాండ్స్-ఫ్రీ, రియల్-టైమ్‌లో. అంటే కాల్ చేయకుండా, నేరుగా గ్రూప్‌లో లైవ్ వాయిస్ చాట్‌ను ప్రారంభించవచ్చు, అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు ఉంటుంది.
అన్ని రకాల గ్రూపుల‌్లో అందుబాటులో ఉంది
ప్రారంభంలో ఈ ఫీచర్ పెద్ద గ్రూపులకు మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు అన్ని గ్రూప్‌లకు ఈ సౌకర్యం అందించారు. మీ గ్రూప్ 3-4 మంది లేదా 100 మందికిపైగా సభ్యులు ఉన్నా, అందరు వినియోగదారులు ఇప్పుడు ఈ వాయిస్ చాట్ ప్రయోజనాన్ని పొందవచ్చు.
Android అండ్ iOS రెండింటిలో ప్రారంభం
ఈ ఫీచర్ క్రమంగా అందరి వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. మీ ఫోన్‌లో ఇంకా ఈ అప్‌డేట్ రాలేదు అనుకుంటే, కొంత సమయం వేచి చూడండి, త్వరలోనే ఇది మీ పరికరంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ Android అండ్ iOS రెండు ప్లాట్‌ఫామ్‌లలో పనిచేస్తుంది.
వాయిస్ నోట్స్‌కు భిన్నంగా ఈ చాట్ ఫీచర్
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కొత్త ఫీచర్ సాంప్రదాయ వాయిస్ నోట్స్‌కు భిన్నంగా ఉంటుంది. వాయిస్ నోట్స్ ఏకపక్ష సందేశాలను పంపుతాయి, అయితే వాయిస్ చాట్ కాల్ బటన్ నొక్కకుండానే నేరుగా గ్రూప్‌లో సంభాషణను ప్రారంభించే లైవ్ గ్రూప్ కాల్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫీచర్ ఎందుకు ప్రత్యేకం?
స్నేహితులతో ప్రయాణ ప్రణాళిక చేయడం లేదా ఆఫీస్ బృందంతో త్వరగా సమావేశం అవ్వడం వంటివి చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ మీ డిస్కషన్స్‌ను వేగవంతం చేయడమే కాకుండా, మరింత సహజమైన, ఇంటరాక్టివ్‌గా చేస్తుంది. డిజిటల్ సంభాషణలు మునుపెన్నడూ లేని విధంగా సులభమైన, ప్రభావవంతమైనవిగా మారేలా WhatsApp నిరంతరం తన సేవలను మెరుగుపరుస్తోంది.





















