News
News
X

Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ ఇటీవలే ఫోన్ 1 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధరను రూ.1,000 పెంచారు.

FOLLOW US: 

నథింగ్ బ్రాండ్ ఇటీవలే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదే నథింగ్ ఫోన్ (1). ఈ ఫోన్ విషయంలో ఇప్పటికే ఎన్నో నాణ్యతా పరమైన సమస్యలు వచ్చినట్లు నెటిజన్లు కంప్లైంట్ చేశారు. వినియోగదారులకు స్టేబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి కొన్ని అప్‌డేట్స్ కూడా కంపెనీ అందించింది.

అయితే ఇప్పుడు అందించింది మాత్రం అప్‌డేట్ కాదు షాక్ అని చెప్పాలి. ఎందుకంటే నథింగ్ ఫోన్ (1) ధరను కంపెనీ రూ.1,000 మేర పెంచింది. దీంతో 8 జీబీ ర్యామ్ +  128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999కు, 8 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు, 12 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పెరిగింది.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్ల గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెన్సార్ ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ ప్రకటించింది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

View this post on Instagram
 
A post shared by Nothing (@nothing)

Published at : 19 Aug 2022 01:08 AM (IST) Tags: Nothing Nothing Phone 1 Nothing Phone 1 Price in India Nothing Phone 1 Price Hike Nothing Phone 1 Issues

సంబంధిత కథనాలు

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!

Central Information Commission: భర్త జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉంటుంది, ఆ చట్టంతో లెక్కలు తేల్చేయచ్చు!