News
News
X

మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌లో కొత్త మోడల్ - ఏం మారనుందంటే?

మోటొరోలా 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ త్వరలో లాంచ్ కానుంది.

FOLLOW US: 

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రాలో కొత్త వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. దీని హైఎండ్ వేరియంట్‌లో 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. అయితే ఆ మోడల్ ఇంకా లాంచ్ కాలేదు. త్వరలో లాంచ్ చేయనున్నట్లు రియల్‌మీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం లాంచ్ అయిన మోడల్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. 

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా రేటు
మొదట లాంచ్ అయినప్పుడు ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధర రూ.59,999గా ఉంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద ఆ సేల్‌లో రూ.54,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందించనున్నారు. త్వరలో ఎక్కువ స్టోరేజ్ ఉన్న వేరియంట్ కూడా లాంచ్ కానుంది.

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ స్కిన్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో అందుబాటులో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్‌ను ప్రొటెక్ట్ చేయనుంది.  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. ఫోన్ వెనకవైపు కర్వ్‌డ్ ప్యానెల్‌తో రానుంది. పంచ్ హోల్‌ను స్క్రీన్ పైన మధ్య భాగంలో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు చూడవచ్చు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఏకంగా 60 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పనిచేయనుంది. స్నాప్‌డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4610 ఎంఏహెచ్ కాగా, 125W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం ఏడు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్, 19 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్ ఎక్కనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 18 Sep 2022 06:53 PM (IST) Tags: Motorola Motorola New Phone Motorola Edge 30 Ultra Motorola Edge 30 Ultra 12GB RAM Motorola Edge 30 Ultra 256GB

సంబంధిత కథనాలు

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

ఐకూ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 5జీ ప్రాసెసర్, సూపర్ ఫీచర్లతో!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

Redmi Note 12 Series: 210W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త ఫోన్ - ఈ సంవత్సరమే లాంచ్!

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Moto G72: 108 మెగాపిక్సెల్ కెమెరాతో మోటొరోలా కొత్త ఫోన్ - లాంచ్ రెండు రోజుల్లోనే!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

ఈ కొత్త ఐఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలు అట - మీరు వాడుతున్నారా?

టాప్ స్టోరీస్

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!