అన్వేషించండి

Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!

మోటొరోలా కొత్త 5జీ ఫోన్‌ మోటో జీ62 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

మోటో జీ62 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

మోటో జీ62 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. దీన్ని ఫ్రాస్టెడ్ బ్లూ, మిడ్ నైట్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

మోటో జీ62 5జీ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పంచ్ హోల్ కటౌట్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై మోటో జీ62 5జీ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 20W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 184 గ్రాములుగా ఉంది.

మోటొరోలా  తన 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే మోటొరోలా ఎక్స్30 ప్రో. ప్రపంచంలో 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. మోటొరోలా ఎక్స్30 ప్రోలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగా (సుమారు రూ.43,600) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,199 యువాన్లుగానూ(సుమారు రూ.49,500), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లుగానూ (సుమారు రూ.53,000) ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ ప్రకటించలేదు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget