Moto G32: త్వరలో లాంచ్ కానున్న మోటొరోలా బడ్జెట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో జీ32ని మనదేశంలో ఆగస్టు 9వ తేదీన లాంచ్ చేయనుంది.
మోటో జీ32 స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో గత నెలలో లాంచ్ అయింది. ఈ ఫోన్ త్వరలో మన దేశంలో కూడా లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ మనదేశంలో ఆగస్టు 9వ తేదీన లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మోటో జీ32 లాంచ్ డేట్‌ను మోటొరోలా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయింది కాబట్టి స్పెసిఫికేషన్ల విషయంలో దాచుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ధర విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. లాంచ్ రోజునే కంపెనీ ధరను అధికారికంగా ప్రకటించనుంది.
మోటో జీ32 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్‌గా ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 30W టర్బో చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు. వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో మోటో జీ32 మార్కెట్లోకి రానుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!