News
News
X

iQoo 9T: ఐకూ 9టీ ధర లీక్ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్‌లో బెస్ట్ ఫోన్?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో లాంచ్ చేయనున్న ఐకూ 9టీ ఫోన్ ధర లీక్ అయింది.

FOLLOW US: 

ఐకూ 9టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఆగస్టు 2వ తేదీన లాంచ్ కావాల్సింది. అయితే పలువురు కంటెంట్ క్రియేటర్లు ఈ ఫోన్‌కు సంబంధించిన ధర వివరాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. చైనాలో ఐకూ 10 పేరుతో లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఐకూ 9టీ పేరుతో రానుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు.

ట్రాకిన్‌టెక్, బీబోమ్ వంటి టెక్ యూట్యూబర్లు దీనికి సంబంధించిన అన్‌బాక్సింగ్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ధర, సేల్ వివరాలను కూడా రివీల్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉండనుంది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉండనుంది. ఆగస్టు రెండో తేదీన వీటి సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.4,000 తగ్గింపు అందించనున్నారు.

ఐకూ 9టీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.78 అంగుళాల ఈఎస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080 x 2,400 పిక్సెల్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్ సపోర్ట్, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. వీ1ప్లస్ ఇమేజింగ్ చిప్ కూడా ఇందులో ఉండనుంది. ఇది కెమెరా పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచనుంది.

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్663 సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

4700 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ 5జీ సిమ్, వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 29 Jul 2022 12:41 AM (IST) Tags: iQOO iQOO New Phone iQoo 9T iQoo 9T Price in India iQoo 9T Leaks

సంబంధిత కథనాలు

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?

Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?

Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!

Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!

Moto Razr 2022: ఐదు నిమిషాల్లో 10 వేల సేల్స్ - మోటొరోలా ఫోన్ కొత్త రికార్డు!

Moto Razr 2022: ఐదు నిమిషాల్లో 10 వేల సేల్స్ - మోటొరోలా ఫోన్ కొత్త రికార్డు!

Samsung Galaxy: అదిరిపోయే స్మార్ట్ ఫోన్లకు ప్రీ బుకింగ్ షురూ, ఇప్పుడే బుక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే

Samsung Galaxy: అదిరిపోయే స్మార్ట్ ఫోన్లకు ప్రీ బుకింగ్ షురూ, ఇప్పుడే బుక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే

టాప్ స్టోరీస్

India Vs Zimbabwe: పోరాడిన జింబాబ్వే టెయిలెండర్లు - భారత లక్ష్యం ఎంతంటే?

India Vs Zimbabwe: పోరాడిన జింబాబ్వే టెయిలెండర్లు - భారత లక్ష్యం ఎంతంటే?

Bandi Sanjay : భౌతిక దాడులు ఖాయం - బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !

Bandi Sanjay :  భౌతిక దాడులు ఖాయం -  బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక !

AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు - ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

AP News : గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి రూ. 3 వేల కోట్లు -  ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్

Bandla Ganesh On Bjp : బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్