iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 13వ తేదీన మార్కెట్లో లాంచ్ కానుందని సమాచారం.
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చే నెలలో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. అక్టోబర్‌కు ఈ లాంచ్ వాయిదా పడనుందని గతంలో వార్తలు వచ్చినా యాపిల్ సంప్రదాయ సెప్టెంబర్ డేట్‌కే స్టిక్ అయిందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ ఫోన్లు సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందో బయటకు వచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన యాపిల్ తన లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుందని తెలుస్తోంది.
ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌లో యాపిల్ ఏ16 ప్రాసెసర్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో యాపిల్ ఏ17 బయోనిక్ ప్రాసెసర్లు అందించారు.
9టు5మాక్ కథనం ప్రకారం... ఐఫోన్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కానుంది. సెప్టెంబర్ 13వ తేదీన సెలవు తీసుకోవద్దని యాపిల్ తన ఉద్యోగులను అభ్యర్థించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. యాపిల్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఎప్పుడూ సెప్టెంబర్‌లోనే లాంచ్ చేస్తుంది.
2022లో సెప్టెంబర్ 7వ తేదీన ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయిన ‘ఫార్ అవుట్’ ఈవెంట్ జరిగింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అయ్యాయి. యాపిల్ అదే టైమ్‌లైన్ ఫాలో అయితే ఐఫోన్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.
ఐఫోన్ 15 మోడల్స్ గురించిన సమాచారాన్ని కంపెనీ ఇంతవరకు షేర్ చేయలేదు. గతంలో వచ్చిన లీకులు పరిశీలిస్తే ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందించనుంది. డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ కూడా ఐఫోన్ 15 అన్ని మోడల్స్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో యాపిల్ ఏ17 బయోనిక్ చిప్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 15, 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై పని చేయనున్నాయని సమాచారం.
మరోవైపు ఐఫోన్ ఎస్ఈ 4 స్మార్ట్ ఫోన్ ఎంతో కాలం నుంచి వార్తల్లో ఉంది. ఐఫోన్ 14 తరహా డిజైన్‌తో బడ్జెట్ ఐఫోన్ రానుందని తెలుస్తోంది. మొదట యాపిల్ ఈ ఫోన్‌ను 2024లో లాంచ్ చేయనుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఐఫోన్ ఎస్ఈ కొత్త జనరేషన్ మోడల్ లాంచ్ 2025కు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ డిజైన్ ఐఫోన్ ఎక్స్ఆర్ తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఆల్ స్క్రీన్ తరహా డిజైన్ ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఐఫోన్ ఎస్ఈ మూడో తరం ఫోన్ 2022 మార్చిలో లాంచ్ అయింది.
ఐఫోన్ 14, ఐఫోన్ ఎక్స్ఆర్ తరహా డిజైన్‌లో ఐఫోన్ ఎస్ఈ 4 కూడా లాంచ్ కానుందని యాపిల్ తెలిపింది. ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ ప్యానెల్ ఉండనుందని సమాచారం. దీని అంచులు చాలా ఫ్లాట్‌గా ఉండనున్నాయి. ఫేస్ ఐడీని కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial