అన్వేషించండి

iPhone 14 Price: ఐఫోన్ 14 సిరీస్ తక్కువ ధరకే - రేటు విషయంలో యాపిల్ నో రిస్క్!

ఐఫోన్ 14 సిరీస్ ధరకు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

యాపిల్ ఐఫోన్ 14 ధర 799 డాలర్ల (సుమారు రూ.64,000) నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే మార్కెట్ రీసెర్చ్ ట్రెండ్ ఫోర్స్ తెలుపుతున్న దాని ప్రకారం వీటి ధర ఎక్కువగా పెరగకపోవచ్చు. ఈ నివేదికల ప్రకారం దీని ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000) నుంచి ప్రారంభం కానుంది.

ట్రెండ్ ఫోర్స్ కథనం ప్రకారం ఐఫోన్ 14 ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000), ఐఫోన్ మ్యాక్స్ ధర 849 డాలర్ల (సుమారు రూ.68,000), ఐఫోన్ 14 ప్రో ధర 1,049 డాలర్ల (సుమారు రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,149 డాలర్ల (సుమారు రూ.91,000) నుంచి ప్రారంభం కానుంది.

ధర ఎక్కువగా పెంచితే ఆ ప్రభావం సేల్స్‌పై పడుతుందేమోనని యాపిల్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ద్రవోల్బణం, ఫారిన్ ఎక్స్‌చేంజ్ రేట్లు పెరుగుతుండటం కూడా ధర విషయంలో యాపిల్ తగ్గడానికి ఒక కారణం కావచ్చు.

ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతో మెరుగైన 48 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐఫోన్ 13 ప్రో సిరీస్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండగా, వాటిని భారీగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

ఐఫోన్ 14 ప్రొడక్షన్‌ను చైనాలో కాకుండా మనదేశంలో చేయనుందని గతంలో వార్తలు వచ్చాయి. చైనాకు చెందిన ‘క్సీ’ కంపెనీ నిర్వాహకులతో వివాదాలు రావడం, అక్కడ లాక్ డౌన్‌లు నడుస్తుండటంతో ఆ దేశంలో ఉత్పత్తి చేయడం కష్టం అయిందని తెలుస్తోంది.

ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో కొత్త ఐఫోన్లతో పాటు ట్యాబ్‌లు, మ్యాక్‌లు, ఆపరేటింగ్ సిస్టంలకు కొత్త అప్‌డేట్లు కూడా రానున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ లేటెస్ట్ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్ 14 మ్యాక్స్ ఫీచర్లు (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా గతంలోనే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఐఫోన్ 14 మ్యాక్స్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... దీని పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో ఉండనుంది.

యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget