News
News
వీడియోలు ఆటలు
X

Infinix Smart 7 HD: రూ.ఆరు వేలలోపే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!

ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో స్మార్ట్ 7 హెచ్‌డీ అనే బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

FOLLOW US: 
Share:

Infinix Smart 7 HD: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.5,999గా నిర్ణయించారు. ఇంక్ బ్లాక్, జేడ్ వైట్, సిల్క్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మే 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. రూ.211 నుంచి దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఈఎంఐ ప్రారంభం కానుంది.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆధారిత ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 

2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్ నుంచి మరో 2 జీబీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ1 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 7 హెచ్‌డీ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 39 గంటల కాలింగ్ టైమ్, 50 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 30 రోజుల స్టాండ్ బై టైమ్‌ను ఇది ఒక్క ఛార్జ్‌తో అందించనుంది. అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్‌తో కేవలం ఐదు శాతం చార్జింగ్‌తో కూడా రెండు గంటల కాలింగ్ టైం లభించనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజుల స్టాండ్‌బై టైంను ఇది అందించనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఇది స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ అంటోంది. ఈ ధర ఎంత వరకు ఉంటుందో తెలియరాలేదు. డైమండ్ వైట్, గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. దీని స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్లు రూ.317 నుంచి ప్రారంభం కానున్నాయి.

Published at : 01 May 2023 04:39 PM (IST) Tags: Infinix Smart 7 HD Price in India Infinix Smart 7 HD Infinix Smart 7 HD Launched Infinix Smart 7 HD Specifications Infinix Smart 7 HD Features

సంబంధిత కథనాలు

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే!

WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

WhatsApp New Feature: ఇకపై  స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

Daam malware: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త! ఈ మాల్వేర్ మహా డేంజర్!

టాప్ స్టోరీస్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!