By: ABP Desam | Updated at : 29 May 2022 04:42 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ జీ88 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఫోర్స్ బ్లాక్, జ్యువెల్ బ్లూ, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం అయింది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 వరకు తగ్గింపు లభించనుంది. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 పనిచేయనుంది. ఈ ఫోన్ మందం 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు 184.5 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Redmi K50i: రెడ్మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది - 64 మెగాపిక్సెల్ కెమెరాతో!
OnePlus 10RT India Launch: వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ త్వరలోనే - రెండు ఆప్షన్లలో!
Oppo Reno 8 Price: ఒప్పో రెనో 8 సిరీస్ ధర లీక్ - మిడ్‌రేంజ్‌లో సూపర్ కెమెరా ఫోన్లు!
JioPhone Next Offer: రూ.4 వేలలోపే స్మార్ట్ ఫోన్ - రూ.14 వేల లాభాలు - బంపర్ ఆఫర్!
Asus ROG Phone 6: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ వచ్చేస్తుంది - 18 జీబీ వరకు ర్యామ్!
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్