Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి.
Premium Smartphone: సాధారణంగా మనదేశంలో వినియోగదారులు బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడం కూడా పెరిగింది. తాజాగా మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ దీనికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతీయ వినియోగదారులు రూ. లక్ష కంటే ఎక్కువ ధర గల ఫోన్లను చాలా ఇష్టపడుతున్నారని పేర్కొంది.
ఇప్పటి వరకు భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీని కారణంగా చైనీస్ మొబైల్ టెక్ కంపెనీలు తమ చవకైన ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసేవి. అయితే గత సంవత్సరంలో మొబైల్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు... వినియోగదారుల మొదటి ఆప్షన్‌గా మారాయి. వీటిలో ఫోల్డ్, ఫ్లిప్, ఐఫోన్ వంటి సిరీస్‌లు ఉన్నాయి. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతల కారణంగా ఏ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకాలు పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.
కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేశారు. దీని కారణంగా ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 112 శాతం పెరిగాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్, ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్‌లు ప్రజల మొదటి ఆప్షన్లుగా మారాయి.
మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గురించి మాట్లాడితే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 17 శాతం పెరిగాయి. మరోవైపు లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫోన్లను కొనుగోలు చేసే వారి సంఖ్య 8 శాతం పెరిగింది. అందుకే ఒప్పో, టెక్నో, వివో వంటి కంపెనీలు కూడా తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడం ప్రారంభించాయి.
మార్కెట్‌లో ప్రీమియం ఫోన్‌లకు డిమాండ్ పెరిగిన తర్వాత శాంసంగ్, ఒప్పో, టెక్నో కంపెనీలు తమ ఫోల్డ్,చ ఫ్లిప్ ఫోన్‌లను కూడా విడుదల చేయడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీలు బడ్జెట్ ఫోన్‌లను మాత్రమే విడుదల చేసేవని. దీని కారణంగా బడ్జెట్ విభాగంలో స్మార్ట్‌ఫోన్లకు పోటీ చాలా ఎక్కువగా ఉండేది. ఈ కంపెనీలు ఇప్పుడు ప్రీమియం విభాగంలో కూడా ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించాయి.
మరోవైపు ఛాటింగ్ అనుభవాన్ని మరింత మార్చే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. వాట్సాప్ ఛాట్‌లో ఫోటోలు, వీడియోలు, జిఫ్‌లను ఓపెన్ చేసేటప్పుడు కంపెనీ రిప్లై ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ని పర్యవేక్షించే వెబ్‌సైట్ Wabetainfo షేర్ చేసింది. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ ఈ అప్‌డేట్‌ని అందరు వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial