Emergency alerts on Android and iPhone: ప్రభుత్వం నుంచి మీ ఫోన్‌కే ఎమర్జెన్సీ అలర్ట్.. అందుకోసం మీరు ఏం చేయాలంటే
How to activate government alerts on Android and iPhone | ప్రభుత్వాల నుంచి ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందడానికి ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు అవకాశం ఉంది.

India Pakistan Emergency Alerts: భారతదేశం, పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో భాగంగా కాల్పుల విరమణకు శనివారం అంగీకరించాయి. కానీ కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి తన వక్రబుద్ధి నిరూపించుకుంది. కాల్పుల విమరణ ప్రకటన అనంతరం జమ్మూ, శ్రీనగర్‌తో సహా పలుచోట్ల డ్రోన్ దాడులకు ప్రయత్నించగా, భారత బలగాలు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు.
ఇలాంటి సమయంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వాలు, అధికారులు వారి ప్రజలను బ్లాక్ అవుట్ సహా ఎయిర్ సైరన్ల గురించి.. ఆ సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయాల్లో ప్రజలు ప్రభుత్వాల నుంచి, అధికారుల నుంచి నేరుగా ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. దాంతో మీరు ఇంట్లోని ఉండి నేరుగా మీ ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందవచ్చు. అందుకోసం Android, iPhone యూజర్లు కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. అది ఎలాం చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.
ఆండ్రాయిడ్ యూజర్ల (Android sers) కోసం అత్యవసర హెచ్చరికలు
స్టెప్ 1: మీ ఆండ్రాయిస్ ఫోన్‌లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్స్‌లోకి వెళ్లాక మీరు Safety and Emergency లేదా Emergency alerts ఆప్షన్లలో ఏమైనా ఉందేమో చెక్ చేసి క్లిక్ చేయాలి.
స్టెప్ 3: తరువాత మీరు వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు (Wireless emergency alerts) పై క్లిక్ చేయండి
స్టెప్ 4: అందులో మీకు అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను యాక్టివేట్ చేసుకోండి.
అయితే ఫోన్ల బ్రాండ్లను బట్టి ఆండ్రాయిడ్ యూజర్లకు భిన్నమైన ఆప్షన్లు కనిపిస్తాయి. కొన్ని మోడల్స్‌లో అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాక, లేక మోర్ సెట్టింగ్స్ లేదా సెల్ బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాక “వైర్‌లెస్ అత్యవసర హెచ్చరికలు” (Wireless emergency alerts) ఉండవచ్చు.
ఐఫోన్ యూజర్లు (iPhone Users) కోసం అత్యవసర హెచ్చరికలు
స్టెప్ 1: మీ ఐఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
స్టెప్ 3: తరువాత “ప్రభుత్వ హెచ్చరికలు” (Government Alerts) కోసం కిందకు స్క్రోల్ చేయండి
స్టెప్ 4: ప్రభుత్వం నుండి ఇలాంటి ఎమర్జెన్సీ అలర్ట్స్ పొందేందుకు ‘టెస్ట్ అలర్ట్స్’ బటన్‌ను ఎంచుకోండి.
ఇవి ప్రభుత్వం నుచి నేరుగా వచ్చే అలర్ట్స్. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, భూకంపాలు, ఘోర విపత్తులు లాంటి అత్యవసర పరిస్థితిలో అలర్ట్స్ పొందడం ద్వారా ఎన్నో ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణ నష్టం సైతం జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది.
భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం
పాకిస్తాన్, భారత్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. పాకిస్తాన్ DGMO (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత DGMOకి ఫోన్ చేసి కాల్పుల విమరణకు చర్చించారు. వారి రిక్వెస్ట్ మేరకు భారత డీజీఎంవో కాల్పుల విరమణతో పాటు ఆర్మీ యాక్షన్ నిలిపివేయాలని ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కానీ కొన్ని గంటలకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది, కొన్నిచోట్ల డ్రోన్ దాడులు చేసింది.























