BSF Jawan Martyred: దేశం కోసం ప్రాణాలు అర్పించిన బీఎస్ఎఫ్ జవాన్, పాక్‌తో పోరాడుతూ అమరుడైన ఇంతియాజ్
India Vs Pakistan: దేశ సరిహద్దుల్లో భద్రత కోసం పోరాడుతూ మరో బీఎస్ఎఫ్ జవాను అమరుడయ్యారు. బిహార్ కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

BSF Jawan Mohammad Imtiaz Martyred: శ్రీనగర్: దేశం కోసం సరిహద్దుల్లో పాక్‌తో పోరాడుతూ మరో సైనికుడు అమరుడయ్యాడు. మే 10న జమ్మూలోని ఆర్‌ఎస్ పురా ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ మరణించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగానికి బిఎస్‌ఎఫ్ డీజీ, అన్ని ర్యాంకుల అధికారులు సెల్యూట్ చేశారు. ఈ కష్ట సమయంలో ప్రహరీ పరివార్ మృతుల కుటుంబానికి అండగా నిలుస్తుందని బీఎస్‌ఎఫ్ డీజీ ఓ ప్రకటనలో తెలిపారు.
జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల్లో BSF జవాను అమరుడు కాగా, మరో ఏడుగురు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగింది. పాక్ కాల్పుల్లో మరణించిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ బిహార్‌లోని ఛప్రా వాసి. బీఎస్ఎఫ్ ఎస్సై మహ్మద్ ఇంతియాజ్ ధైర్యంగా నాయకత్వం వహించి, పాక్ మూకలతో పోరాడుతూ అత్యున్నత త్యాగం చేశారని సరిహద్దు భద్రతా దళం (BSF) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడిన మరో ఏడుగురు సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
DG BSF and all ranks salute the supreme sacrifice made by BSF Sub Inspector Md Imteyaz in service to the Nation on May 10, during cross-border firing by Pakistan along the International Boundary in RS Pura area, Jammu. Prahari Pariwar stands firm with the bereaved family in this… pic.twitter.com/opUiepRutV
— ANI (@ANI) May 10, 2025
నారాయణపూర్ గ్రామంలో విషాదఛాయలు
BSF ఈ విషయాన్ని వెల్లడించగానే సబ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ గడ్ఖా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నారాయణపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇంతియాజ్ ఇంటికి పెద్ద సంఖ్యలు ప్రజలు వెళ్లారు. అమరుడైన ఇంతియాజ్ కుటుంబ సభ్యులను స్థానికులు ఓదార్చారు. దేశం కోసం ఇంతియాజ్ వీరమరణం పొందారని, ఆయన సేవలు మరువలేనివి అన్నారు. ఆదివారం (మే 11) సాయంత్రం నాటికి బీఎస్ఎఫ్ ఎస్సై మృతదేహం గ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. తమ కుమారుడు దేశం కోసం అమరుడయ్యాడని కుటుంబం గర్వంగా చెప్పడం స్థానికులను కంటతడి పెట్టించింది.
తేజస్వి యాదవ్ సంతాపం
‘జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన బిహార్‌లోని చాప్రా నివాసి, BSF సబ్-ఇన్‌స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ సాహబ్ శౌర్యం, త్యాగానికి సెల్యూట్ చేస్తున్న. దేశప్రజలు ఎల్లప్పుడూ ఇంతియాజ్ ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తుంచుకుంటుంది. ఆయన దేశ భక్తికి సెల్యూట్ అని’ తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
जम्मू में अंतरराष्ट्रीय सीमा पर देश की सुरक्षा के लिए शहादत देने वाले छपरा, बिहार के रहने वाले BSF के बहादुर सब-इंस्पेक्टर मोहम्मद इम्तियाज साहब की वीरता और बलिदान पर सलाम एवं कोटिशः नमन।
— Tejashwi Yadav (@yadavtejashwi) May 10, 2025
देशवासी सदैव उनके शौर्य, पराक्रम, साहस, बलिदान और देशप्रेम को नमन करता रहेगा। #bsf… pic.twitter.com/obln7wRHLA
భారత్, పాకిస్తాన్‌లు శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అన్ని బలగాలు కాల్పులు నిలిపివేయాలని, సైనిక చర్యలను నిలిపివేయాలని రెండు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. అనంతరం మూడు గంటలకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.






















