(Source: ECI/ABP News/ABP Majha)
Apple: చైనాకు షాకివ్వనున్న యాపిల్ - భారత్‌కు గుడ్ న్యూస్!
యాపిల్ త్వరలో తన తయారీ హబ్‌ను చైనా నుంచి భారత్‌కు మార్చనుందని తెలుస్తోంది.
కొన్నేళ్లుగా యాపిల్ తన ఉత్పత్తులను చైనాలో తయారు చేస్తోంది. ఐఫోన్ అయినా, మ్యాక్‌బుక్ అయినా చైనాలోని Apple తయారీ భాగస్వాములు ప్రతి గాడ్జెట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇటీవల యాపిల్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తున్నందున దాని సరఫరా చైన్ నిర్వహణ వ్యూహాన్ని సర్దుబాటు చేస్తోంది. చైనా బయటకు ఉత్పత్తి సౌకర్యాలను తరలించడం దీని ప్రధాన వ్యూహం. iPhone తయారీ విషయంలో మాత్రం భారతదేశం ముందంజలో ఉంది.
ప్రఖ్యాత విశ్లేషకుడు మింగ్-చి కువో తెలుపుతున్న వివరాల ప్రకారం ఐఫోన్ ఉత్పత్తిని చైనా నుండి భారతదేశానికి మెల్లగా తరలించాలని యాపిల్ నిర్ణయించుకుంది. అయితే MacBook ఉత్పత్తి, అసెంబ్లీ థాయ్‌లాండ్‌కు మారనుంది. Apple తయారీ భాగస్వాములు, Foxconn, Pegatron, Wistron ఇప్పటికే భారతదేశంలో iPhone 13, iPhone 12 వంటి ప్రధాన ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేస్తున్నాయి. అయితే తాజా iPhone 14 ఉత్పత్తి డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఐఫోన్ల ఉత్పత్తి మొత్తం షిఫ్ట్ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని కుయో చెప్పారు. మూడు నుంచి ఐదేళ్లలో చైనా వెలుపలి నుంచి సరఫరా బయటకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో మరిన్ని ఐఫోన్ మోడల్‌లను ఉత్పత్తి చేయడానికి టాటా గ్రూప్ భవిష్యత్తులో పెగాట్రాన్ లేదా విస్ట్రాన్‌తో కలిసి పని చేస్తుందని బ్లూమ్‌బెర్గ్ గతంలో తెలిపింది. అతను తన తాజా ఇన్‌పుట్‌లలో దానిని ధృవీకరించాడు. "భారతదేశంలో తయారు అయిన 80 శాతం కంటే ఎక్కువ ఐఫోన్‌లు (ఫాక్స్‌కాన్ ద్వారా) ప్రస్తుతం దేశీయ డిమాండ్‌ను తీర్చగలవు" అని కువో ఒక ట్వీట్‌లో తెలిపారు. టాటా గ్రూప్‌కు, పెగాట్రాన్ లేదా విస్ట్రాన్ మధ్య భాగస్వామ్యం చైనాయేతర ఐఫోన్ ఉత్పత్తి పెరుగుదలను వేగవంతం చేయగలదు" అని కువో పేర్కొన్నారు.
ఇటీవలే జేపీ మోర్గాన్ కూడా ఇదే ప్రిడిక్ట్ చేసింది. 2025 నాటికి Apple iPhone ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతును భారతదేశానికి తరలిస్తుందని చెప్పారు. ఇందులో iPhone 14 ఉత్పత్తిలో 5 శాతం ఉంటుంది, ఇది డిసెంబర్ నాటికి భారతదేశానికి రానుంది. భారతదేశంలో మరిన్ని ఐఫోన్‌లను ఉత్పత్తి చేసినా కొత్త మోడళ్ల ధర తగ్గే అవకాశం లేదు. యాపిల్ తన ఐఫోన్‌ల అసెంబ్లీ స్థానికంగా జరుగుతున్నందున వాటి ధరలను తగ్గిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి.
Apple MacBook "నాన్-చైనా" తయారీ థాయ్‌లాండ్‌లో జరగవచ్చని కువో చెప్పారు. ప్రస్తుతం అన్ని మ్యాక్‌బుక్‌లు చైనాలోని ప్రొడక్షన్ సైట్‌లలో అసెంబుల్ అవుతున్నాయి. అంటే మార్పుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. చైనా వెలుపలకు అసెంబ్లీ లైన్‌లను మార్చే ప్రక్రియ మొత్తం సంవత్సరాలు పడుతుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram