News
News
X

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గూగుల్ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ అయింది. అదే గూగుల్ పిక్సెల్ 7.

FOLLOW US: 
 
గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మనదేశంలో గురువారం లాంచ్ చేసింది. ఇందులో గూగుల్ రెండో తరం టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 10.8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఏకంగా ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను గూగుల్ ఈ ఫోన్లకు అందించనుంది.

గూగుల్ పిక్సెల్ 7 ధర
ఈ ఫోన్ ధరను రూ.59,999గా నిర్ణయించారు. స్నో, ఆబ్సీడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 13వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ప్రీ-ఆర్డర్ టైంలో ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 డిస్కౌంట్ లభించనుంది.

గూగుల్ పిక్సెల్ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.32 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

News Reels

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ ప్రకటించింది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Made by Google (@madebygoogle)

Published at : 06 Oct 2022 10:23 PM (IST) Tags: Google New Phone Google Pixel 7 Google Pixel 7 Price in India Google Pixel 7 Launched Google Pixel 7 Specifications Google Pixel 7 Features

సంబంధిత కథనాలు

Tecno Pova 4: రూ.12 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఫోన్ - శాంసంగ్, నోకియా బడ్జెట్ ఫోన్లతో పోటీ!

Tecno Pova 4: రూ.12 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఫోన్ - శాంసంగ్, నోకియా బడ్జెట్ ఫోన్లతో పోటీ!

బడ్జెట్ రేంజ్‌లో టాప్ స్మార్ట్ ఫోన్లు - 2022లో రూ.10 వేలలోపు ఇవే బెస్ట్!

బడ్జెట్ రేంజ్‌లో టాప్ స్మార్ట్ ఫోన్లు - 2022లో రూ.10 వేలలోపు ఇవే బెస్ట్!

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Vivo Y02: రూ.తొమ్మిది వేలలోపే వివో కొత్త ఫోన్ - 1 టీబీ స్టోరేజ్ వరకు - రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లతో పోటీ!

Vivo Y02: రూ.తొమ్మిది వేలలోపే వివో కొత్త ఫోన్ - 1 టీబీ స్టోరేజ్ వరకు - రెడ్‌మీ, రియల్‌మీ ఫోన్లతో పోటీ!

సెల్ఫీలలో ఎన్ని రకాలున్నాయో తెలుసా ? మీరు దిగే సెల్ఫీ పేరు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

సెల్ఫీలలో ఎన్ని రకాలున్నాయో తెలుసా ? మీరు దిగే సెల్ఫీ పేరు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!