Google Discount Sale: పిక్సెల్ 9, పిక్సెల్ 10 లపై గూగుల్ భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.21,000 వరకు తగ్గింపు
Discount on Pixel 9 and Pixel 10 Mobiles | కొత్త సంవత్సరం సందర్భంగా Google పిక్సెల్ కొనాలనుకుంటే ఇది మంచి అవకాశం. గూగుల్ ప్రత్యేక ఆఫర్లతో 21,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Google Discount on Pixel 9 | 2025 సంవత్సరం రెండు వారాల్లో ముగియనుంది. త్వరలో సెలవుల సీజన్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా Google ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్ ప్రకటించింది. దీనిలో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్ సహా పలు వస్తువుల కొనుగోలుపై గరిష్టంగా రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్‌లో కస్టమర్‌లు పిక్సెల్ పరికరాలతో పాటు స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఉపకరణాలను కూడా చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏ పరికరంపై ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
Pixel 10 పై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్
కొన్ని నెలల కిందట విడుదలైన Pixel 10పై కస్టమర్‌లు ఏకంగా రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ద్వారా Pixel 10 కొనుగోలు చేస్తే మొదట మీకు రూ. 7,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే పిక్సెల్ 10 ప్రో (Pixel 10 Pro), Pixel 10 Pro XLలపై ఈ విధంగా రూ. 10,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కస్టమర్‌లకు 24 నెలల పాటు వడ్డీ లేని EMI అవకాశం కూడా ఇచ్చింది. ఈ ఫోన్ కొనాలనుకున్న వారు ఆ ఆఫర్ ఉపయోగించుకోవడం బెటర్.
Pixel 9 సిరీస్ ధరలు తగ్గాయి
Google ఈ సేల్‌లో Pixel 9 సిరీస్‌ను కూడా కస్టమర్లకు చౌకగా అందిస్తోంది. ఈ ఆఫర్ సేల్‌లో Pixel 9 దాని ప్రారంభ ధర రూ. 79,999 నుంచి రూ. 21,600 తగ్గి రూ. 58,399కి విక్రయాలు చేస్తున్నారు. అదేవిధంగా Pixel 9 Pro Fold, పిక్సెల్ 9ఏ (Pixel 9a) ధరలు కూడా తగ్గాయి. ఇప్పుడు 9 Pro Fold రూ. 1,72,999 బదులు రూ. 1,62,999కి కొనొచ్చు. అదే విధంగా పిక్సెల్ 9a రూ. 49,999 బదులు రూ. 44,999కి కొనుగోలు చేయవచ్చు.
యాక్సెసరీస్‌పై సైతం డిస్కౌంట్
Google ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్‌లో Pixel Watch 3 ధర రూ. 5,000 తగ్గి రూ. 22,915కి తగ్గింది. అదేవిధంగా Pixel Buds Pro 2 కూడా రూ. 3,000 తగ్గి రూ. 19,900కి లిస్ట్ చేశారు. ఈ ఆఫర్ సేల్ జనవరి 2, 2026 వరకు లైవ్‌లో ఉంటుంది. ఈ సమయంలో మీరు పిక్సెల్ మొబైల్స్, ఇతర పరికరాల కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు.
Galaxy S25 Ultra పై కూడా తగ్గింపు లభిస్తుంది
పిక్సెల్ పరికరాల మాదిరిగానే, Samsung యొక్క ఫ్లాగ్‌షిప్ పరికరం Galaxy S25 Ultra పై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. Galaxy S25 Ultra యొక్క 12GB RAM మరియు 256GB నిల్వ వేరియంట్ మొదట రూ. 1,29,999కి వచ్చింది, అయితే ఇప్పుడు Amazonలో ఈ మోడల్ రూ. 1,07,970కి లిస్ట్ చేయబడింది. దీనిపై క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.






















