అన్వేషించండి

AI Alert: చాట్‌జీపీటీ సహా ఏఐ చాట్‌బాట్‌లతో అసలు షేర్ చేసుకోకూడని విషయాలేంటో తెలుసా..

ChatGPT Awareness | టెక్నాలజీ పెరిగేకొద్దీ మంచితో పాటు చెడు కూడా జరుగుతోంది. కొన్ని విషయాలను చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్‌బాట్‌లతో షేర్ చేసుకోకూడదు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

AI chatbots Warning | టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే టెక్నాలజీతో ప్రయోజనాలే కాదు కొన్నిసార్లు దుష్ప్రరిణామాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం చాలావరకు చాట్‌జీపీటీ (ChatGPT) వంటి కృత్రిమ మేధస్సు (Artificial intelligence) చాట్‌బాట్‌లు మనుషులతో సంభాషించి సమాధానాలు చెబుతున్నాయి. అయితే సాధారణ విషయాలకు సమాధానాలు చెప్పడం, మీకు కావాల్సిన చిన్న పనుల్లో మద్దతు తీసుకోవడం వరకు ఓకే. కానీ అన్ని వేళలా, అన్ని విషయాలలో ఏఐ చాట్‌బాట్‌లతో విషయాలు షేర్ చేసుకోవద్దు. ఏఐతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం ప్రైవసీ ఉల్లంఘనకు, డేటా చోరీ, ఐడెంటిటీ చోరీ లాంటి వాటికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక కింద పేర్కొన్న పది విషయాలను మీరు చాట్ జీపీటీతో పాటు ఇతర ఏఐ టెక్నాలజీ టూల్స్‌తో షేర్ చేసుకోవద్దు అని తెలుసుకోండి. 

ఏఐ చాట్‌బాట్‌లతో అస్సలు షేర్ చేసుకోకూడదని 10 విషయాలివే.. 
ఆర్థిక అంశాలు: మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ లాంటి వాటిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసే అవకాశముంది. కనుక బీరు ఏఐ చాట్‌బాట్‌లో నమోదు చేస్తే, ఈ డేటా సైబర్ నేరాళ్లచేతికి వెళ్లి ఇబ్బంది పడతారు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావొచ్చు. మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఇతరులు షాపింగ్ చేసే మోసాలు జరుగుతాయి. కనుక మీ బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాలను అధికారిక సంస్థలు, అధికారులతో మాత్రమే షేర్ చేసుకోవాలి, కానీ చాట్ జీపీటీ లాంటి వాటితో కాదని గ్రహించండి.

వ్యక్తిగత సమాచారం: మీ పూర్తి పేరు, ఇంటి అడ్రస్, మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ వంటి వివరాలు, పనిచేసే ఆఫీసు వివరాలు లాంటివి మీ ఆన్‌లైన్ గుర్తింపును ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. కనుక ఈ విషయాలు అపరిచితులతో పాటు ఏఐ టూల్స్ తో సైతం షేర్ చేసుకోవడం సరికాదు. సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. మీ లొకేషన్ ట్రాక్ చేసి ఇబ్బందులకు గురిచేయవచ్చు. ప్రైవసీ మెయింటైన్ చేయాలి.

చట్టపరమైన అంశాలు: కాంట్రాక్టులు, కోర్టు కేసులు, లేదా వ్యక్తిగత వివాదాల విషయంలో ఏఐ చాట్‌బాట్‌ను సహాయం అడగకూదు. వాటికి వివరాలు అందిస్తే మీ డేటా లీక్ అయ్యి, మీకే హాని జరగవచ్చు.  ఏఐ ఎప్పటికీ లాయర్లకు ప్రత్యామ్నాయం కాదు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయి. విషయం ముందే లీక్ అయితే కేసులు ఓడిపోయే అవకాశం ఉంది. 

ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు: మీ ప్రైవేట్ ఫోటోలను, ఐడీలు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లను చాట్‌బాట్‌లో ఎప్పుడూ అప్‌లోడ్ చేయవద్దు. వాటిని రిమూవ్ చేసినా డిజిటల్ గా ఎక్కడైనా సేవ్ అవుతాయి. మీ వ్యక్తిగత ఫైల్స్ హ్యాక్ చేసి, దుర్వినియోగం చేయవచ్చు. వ్యక్తిగత డాక్యుమెంటేషన్‌ను ఎల్లప్పుడూ ఆఫ్‌లైన్‌లో, ఎన్‌క్రిప్టెడ్ స్టోరేజ్‌లో ఉంచాలి. లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు. 

పాస్‌వర్డ్‌లు: ఏ ఏఐ చాట్‌బాట్‌కు మీ లాగిన్ వివరాలు చెప్పకూడదు. సాధారణ చాటింగ్ లో కూడా పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకున్నా మీ ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాలు, ఆఫీసు అకౌంట్లు హ్యాకింగ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏఐ చాట్‌లలో పాస్‌వర్డ్స్, ఫైల్స్ ఎప్పుడూ ఉంచకూడదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. 

ఆరోగ్యం, మెడికల్ సమాచారం: మీ అనారోగ్య లక్షణాలు లేదా చికిత్సల గురించి ఏఐ చాట్‌బాట్‌లను అడగటం సరికాదు. దానిద్వారా మీకు తప్పుడు రోగ నిర్ధారణ జరగవచ్చు. కనుక డాక్టర్ రికార్డులు, మెడికల్ ప్రిస్కిప్షన్ వంటివి, ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వివరాలు లీక్ అయితే ప్రమాదకరం. డాక్టర్లను మాత్రమే సంప్రదించి చికిత్స తీసుకోవాలి. 

సీక్రెట్ రివీల్ చేయవద్దు: కొంతమంది తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏఐ చాట్‌బాట్‌కు తమ బాధను లేదా రహస్యాలను చెబుతుంటారు. కానీ థెరపిస్ట్‌తో, మీ సన్నిహితులతో చెప్పినంత సురక్షితం కాదని గుర్తుంచుకోండి. మీ సిక్రెట్స్ ను చాట్ బాట్ రివీల్ చేస్తే వాటిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మీకు మరింత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి. 

వర్క్ సంబంధిత సమాచారం: ఉద్యోగులు సీక్రెట్ పేపర్లు, డాక్యుమెంట్స్, లేదా కంపెనీ ప్లాన్ వివరాలను ఏఐ టూల్స్, చాట్ జీపీటీ లాంటి చాట్‌బాట్ లలో కాపీ చేసి పేస్ట్ చేయవద్దని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ వ్యూహాలు, అంతర్గత నివేదికలు వేరే ఆఫీసులకు లీక్ కావచ్చు. ఆఫీస్ డేటా, ఆఫీస్ ప్లాన్స్, బిజినెస్ టార్గెట్స్ షేర్ చేసుకోవడం కార్పొరేట్ భద్రతకు ప్రమాదకరం.

ప్రైవసీ కోరుకునే విషయాలు: మీరు చేస్తున్న పని, మీ అలవాట్లు గానీ ఇతరులకు తెలియకూడదంటే వాటిని ఎప్పుడూ ఏఐ టూల్స్, చాట్‌బాట్‌లతో అసలు షేర్ చేసుకోవద్దు. ఒకసారి మీరు ఏఐ చాట్‌బాట్‌లకు చెప్పారంటే ఏదో ఒకరోజు ఆ విషయం బహిర్గతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఒకసారి రెండుసార్లు ఆలోచించి విషయాలను ఏఐ టూల్స్ తో షేర్ చేసుకోవాలి. మీ డేటా స్టోర్ అవుతుంది. మీరు డిలీట్ చేసినా ఏదో ఓ రోజు మరో కొత్త టూల్, కిట్ ద్వారా విషయం లీకయి మీరు ఆందోళన చెందవచ్చు. డిప్రెషన్ బారిన పడే అవకాశాలు సైతం లేకపోలేదు.

అనుచిత వీడియో, అస్పష్టమైన కంటెంట్: సాధారణంగా అశ్లీల లేదా చట్టవిరుద్ధమైన విషయాలను బ్లాక్ చేసినప్పటికీ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు మీరు షేర్ చేసిన వివరాలు రికార్డు చేసే ప్రమాదం ఉంది. ఇందులో ముఖ్యంగా లైంగిక వీడియోలు, సమాచారం, అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా చట్టవిరుద్ధమైన విషయాలు ఉంటే మరిన్ని చిక్కులు తప్పవు. కనుక అలాంటి పనులు మీరు రికార్డ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget