CMF Phone 1: సీఎంఎఫ్ ఫోన్ 1 ఎంట్రీకి రంగం సిద్ధం - సోమవారమే ఇండియాలో లాంచ్!
CMF Phone 1 India Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ ఇటీవలే సీఎంఎఫ్ అనే సబ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్‌పై మొదటి ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1.
CMF Phone 1 Launch: నథింగ్ బ్రాండ్ మార్కెట్లో లాంచ్ అయి ఒక సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా ఎదిగింది. ఇప్పుడు దాని సబ్ బ్రాండ్ సీఎంఎఫ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ మనదేశంలో తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే సీఎంఎఫ్ ఫోన్ 1. ఈ ఫోన్ మనదేశంలో జులై 8వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఇందులో 6.67 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఛేంజబుల్ బ్యాక్‌తో సీఎంఎఫ్ ఫోన్ 1 మార్కెట్లోకి రానుంది.
The engineer’s aesthetic.
— CMF by Nothing (@cmfbynothing) July 3, 2024
CMF Phone 1 celebrates technical craftsmanship with its uniquely adaptable nature. Customisable. Functional. Yours.
Learn everything at the next Nothing Community Update on 8 July 2024, 10:00 BST. pic.twitter.com/0fqYkaf4OX
సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు (లీకుల ప్రకారం)
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలుపుతున్న దాని ప్రకారం సీఎంఎఫ్ ఫోన్ 1లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గానూ, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ వరకు ఉంది. ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించనున్నారు.
ఇందులో మీడియాటెక డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, దీంతో పాటు డెప్త్ సెన్సార్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ 2.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
సీఎంఎఫ్ ఫోన్ 1 ధర (అంచనా)
ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండవచ్చని అంచనా. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై బ్యాంకు ఆఫర్లు కూడా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
నథింగ్ మనదేశంలో కూడా బ్రాండ్ ఎక్స్‌ప్యాన్షన్‌పై బాగా దృష్టి పెట్టింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. రష్మిక సీఎంఎఫ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న పోస్టర్లు కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి.
Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్ చిల్లు