అన్వేషించండి

Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!

చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ వాడే సమయంలో ఇంటర్నెట్ స్లోగా రావడం చాలా మందికి చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం కోసం వెతుకుతున్న సమయంలో నెట్ స్పీడ్ తగ్గడం వలన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు.  UPI లావాదేవీలు జరిపే సమయంలో నెట్ స్లో కావడం వల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. ఒక్కోసారి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా, ఎదుటి వారికి చేరుకోకుండా ప్రాసెసింగ్ లో పడిపోవడం వల్ల, మూడు నాలుగు రోజుల పాటు డబ్బులు రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆఫీస్ లో ఉన్నప్పుడు వైఫై వాడినా, బయటకు వెళ్లినప్పుడు ఫోన్ డేటానే వాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వేగం తగ్గినప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మళ్లీ స్పీడ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.  

డేటా స్పీడ్‌ని పెంచుకునే టిప్స్ ఇవే

ముందుగా మొబైల్ ఇంటర్నెట్ వేగం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం పలు యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నాయి. Ookla Speedtestలో స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. స్పీడ్ టెస్ట్ చేసుకునేందుకు యాప్ ను ఓపెన్ చేసి ‘GO’ బటన్‌ నొక్కాలి. ఇప్పుడు యాప్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని చూపిస్తుంది.

DNS ఛేంజర్ తో నెట్ స్పీడ్ పెంచుకునే అవకాశం

స్పీడ్ టెస్టులో మీ ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నట్లు తేలితే  DNS సర్వర్‌ మార్చుకోవడం ద్వారా వేగాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

DNS సర్వర్‌‌ను ఇలా మార్చుకోవాలి   

Google Play Storeలో Android స్మార్ట్ ఫోన్ల కోసం చాలా DNS ఛేంజర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నచ్చిన DNS ఛేంజర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడానికి యాప్‌కి అవసరమైన  అనుమతులను ఇవ్వాలి. మీరు ఉపయోగించాలి అనుకుంటున్న DNS సర్వర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీ యాప్ సూచించిన డిఫాల్ట్ DNS సర్వర్‌ని కూడా ఉపయోగించవచ్చు. లేదంటే మీకు నచ్చిన DNS సర్వర్  IP అడ్రస్ ను మాన్యువల్‌గా నమోదు చేయవచ్చు. DNS సర్వర్ వేగాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆ తర్వాత కొత్త DNS సర్వర్‌ని పొందేందుకు ‘స్టార్ట్’ అనే బటన్ ను నొక్కాలి. ఇప్పుడు కొత్త DNS సర్వర్ మీ మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది. అయితే, DNS సర్వర్‌ ను ఎంచుకునే సమయంలో సురక్షితమైన వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.

మొబైల్ ఇంటర్నెట్‌ వేగం పెంచే మరికొన్ని చిట్కాలు   

క్రాష్, కుక్కీలను క్లియర్ చేయాలి - మోబైల్ ఫోన్ లో క్రాష్, కుక్కీలను క్లియర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ వేగవంతం అవుతుంది.

డేటా సేవింగ్ మోడ్‌ని ఆన్ చేయాలి-  ఫోన్ లో డేటా సేవింగ్ మోడ్ ను ఆన్ చేయడం కూడా ఇంటర్నెట్ వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది. 

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి - ఒకేసారి చాలా యాప్‌లను రన్ కావడం వల్ల  ఇంటర్నెట్ వేగం తగ్గే అవకాశం ఉంటుంది. RAMని ఖాళీ చేయడం వలన ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. ఇందుకోసం బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను క్లోజ్ చేయాలి. 

ఆటో-అప్‌డేట్‌లను నిలిపివేయాలి - ఆటోమేటిక్ అప్‌డేట్‌లు చాలా డేటాను తీసుకుంటాయి. దీని వలన ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యాప్‌ల ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ఆఫ్ చేయాలి.

Read Also: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget