News
News
X

Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది.

FOLLOW US: 
Share:

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, తమ క్రోమ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ పేరుతో వీటిని విడుదల చేస్తోంది. క్రోమ్ బ్రౌజర్ పని తీరును మెరుగు పరచడంతో పాటు బ్యాటరీ లైఫ్‌ను పొడిగించేందుకు వీటిని రూపొందించింది. గత ఏడాది డిసెంబర్ లో గూగుల్ వీటిని పరిచయం చేసింది. ఆపిల్ మాక్, విండోస్, లైనక్స్, క్రోమ్ బుక్ లో మెమరీ, ఎనర్జీ సేవర్ లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఫీచర్లను యూజర్ల కోసం రిలీజ్ చేస్తోంది. అంతేకాదు, మెమరీ, ఎనర్జీ మోడ్‌ లను అవసరం కొద్ది ఆన్ , ఆఫ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 

గూగుల్ క్రోమ్ మెమరీ సేవర్

కొత్తగా అందుబాటులోకి వచ్చిన క్రోమ్ మెమరీ సేవర్ ఫీచర్ ఆటోమాటిక్‌గా ఇనాక్టివ్ ట్యాబుల నుంచి మెమరీ యూసేజ్‌ను తగ్గిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఈ మెమరీ యూజర్లకు కంప్యూటర్ లోని ఇతర పేజీలు, యాప్ వినియోగానికి ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ ఫీచర్ కారణంగా బ్రౌజర్‌లో పలు  ట్యాబ్‌లను ఓపెన్ చేసి అలాగే ఉంచినా, కొంత సేపు వాటిని వాడకపోతే కంప్యూటర్ మెమరీ నుంచి ఆటోమాటిక్‌గా డిలీట్ అవుతాయి. మళ్లీ అదే ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఆటో మేటిగ్ గా రీలోడ్ అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ను ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశాన్ని సైతం గూగుల్ కల్పిస్తోంది.  ఈ కొత్త ఫీచర్ ద్వారా క్రోమ్ బ్రౌజర్ పనితీరు మరింత మెరుగు పడటంతో పాటు మెమరీ వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ తాజా ఫీచర్ ద్వారా క్రోమ్ 30 శాతం తక్కువ మెమరీని ఉపయోగించనుంది.

Read Also: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

గూగుల్ క్రోమ్ ఎనర్జీ సేవర్ 

డివైజ్ కు సంబంధించి బ్యాటరీని ఆదా చేసుకునేందుకు కొత్త ‘ఎనర్జీ సేవర్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. బ్రౌజర్ బ్యాక్‌ గ్రౌండ్ లో జరిగే యాక్టివిటీస్ ను కంట్రోల్ చేయడం ద్వారా యానిమేషన్లు, వీడియో ఫ్రేమ్ రేట్లను ఆటోమేటిక్ గా డిసేబుల్ చేస్తుంది. ఈ కారణంగా మరింత పవర్ సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవర్ మోడ్‌ కోసం గూగుల్ రెండు ఆప్షన్లను తీసుకొచ్చింది. ఎనర్జీ సేవర్ మోడ్‌ని ఆన్, ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది.  

మెమరీ, ఎనర్జీ సేవర్ లను ఎలా సెట్ చేసుకోవాలంటే?

ప్రస్తుతం గూగుల్ డిఫాల్ట్‌ గా మెమరీ, ఎనర్జీ సేవర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్లు అవసరం లేదు అనుకునే వాళ్లు కింది స్టెప్స్ ఫాలో అయితే ఆఫ్ చేసుకోవచ్చు.   

1. ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.

2. లెఫ్ట్ సైడ్‌ బార్‌లో  పర్ఫార్మెన్స్ ను క్లిక్ చేయాలి.

3. మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ను ఆన్ లేదంటే ఆఫ్ చేసుకోండి.

Read Also: వాట్సాప్ నుంచే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు - జస్ట్, ఇలా చేస్తే చాలు

Published at : 21 Feb 2023 05:49 PM (IST) Tags: Google Chrome feature Memory Saver Energy Saver

సంబంధిత కథనాలు

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయ‌రింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్ష‌న్లు

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయ‌రింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్ష‌న్లు

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్‌మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్‌ గురించి కాస్త తెలుసుకోండి!

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు