Book Uber with Whatsapp: వాట్సాప్ నుంచే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు - జస్ట్, ఇలా చేస్తే చాలు
ఇకపై ఉబెర్ క్యాబ్ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, ప్రస్తుతం ఉబెర్ రైడ్ లను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా వాట్సాప్ నుంచి కూడా తమ క్యాబ్ సేవలను పొందే వెసులుబాటు కల్పిస్తోంది. వినియోగదారులు ఉబెర్ యాప్ డౌన్ లోడ్ చేయకుండానే వాట్సాప్ ద్వారానే రైడ్ లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సేవలను ఇప్పటికే దేశంలోని పలు పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చింది.
Delhi fam, kiska hai yeh tumko intezaar Uber on WhatsApp hai na ✅
— Uber India (@Uber_India) August 10, 2022
Say ‘hi’ on +91-729-200-0002 to book your ride now 🚘#UberOnWhatsApp pic.twitter.com/S6QBc8xvUr
ఈజీగా, ఫాస్ట్ గా క్యాబ్ బుకింగ్
వాట్సాప్ ద్వారా యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు రైడ్ బుక్ చేయడం, ట్రిప్ రిసీస్ పొందడం చేసుకోవచ్చు. అంతేకాదు, యాప్ తో పోల్చితే వాట్సాప్ ద్వారానే బుకింగ్ ప్రాసెస్ ఈజీగా, ఫాస్ట్ గా పొందే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అయితే, కొత్తగా వాట్సాప్ ద్వారా ఉబెర్ సేవలను పొందాలి అనుకునే వారు కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారి కోసం వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్ ఎలా బుక్ చేయాలో ఇప్పుడు చూడండి.
వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్ లను కేవలం సెకన్ల వ్యవధిలోనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్ లో మాదిరిగా రిజిస్ట్రేషన్ లాంటివి అవసరం లేదు. లాగిన్ అవసరం కూడా ఉండదు. కేవలం వాట్సాప్ ఓపెన్ చేసి పికప్, డ్రాపింగ్ పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోంది.
Also Read: ప్రతిసారీ యూపీఐ పిన్ కొట్టాలంటే విసుగ్గా ఉందా? - పేటీయం కొత్త ఫీచర్ ట్రై చేయండి!
వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఉబెర్ కొత్తగా తీసుకొచ్చిన సదుపాయంతో కొన్ని సెకన్లలో వాట్సాప్‌లో ఉబెర్ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ఉబెర్ యాప్‌లోలాగా రిజిస్ట్రేషన్, లాగిన్ వంటి లాంగ్ ప్రాసెస్‌లు అనుసరించాల్సిన అవసరం లేదు. జస్ట్, వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి పికప్, డ్రాప్-ఆఫ్ డెస్టినేషన్ వివరాలు అందిస్తే సరిపోతుంది.
1. తొలుత వాట్సాప్ నుంచి +91 7292000002 నంబర్ కు ‘హాయ్’ అని పంపించాలి. లేదంటే ‘హాయ్ ఉబెర్’ అని పంపించాలి. లేదా ఉబెర్ క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
2. ఆ తర్వాత భాషను ఎంచుకోవాలి. పికప్, డ్రాపింగ్ లొకేషన్ వివరాలను పొందుపర్చాలి.
3. రైడ్ కోసం ఎన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుందో అంచనా వ్యయం కనిపిస్తోంది.
4. మీ ఫోన్ కు ఓ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ రైడ్ ఓకే అవుతుంది.
5. మీకు దగ్గర్లో ఉన్న ఉబెర్ డ్రైవర్ రైడ్ మీ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయగానే మీకు వాట్సాప్ లో ఓ నోటిఫికేషన్ వస్తుంది.
6. ఆ తర్వాత రైడ్ డీటైల్స్ ను వాట్సాప్ చాట్‌లో ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: ఇకపై వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు - సరికొత్త ఫీచర్ వచ్చేసింది