By: ABP Desam | Updated at : 16 Feb 2023 02:35 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Pixabay
ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్, తాజాగా మరో అప్ డేట్ ను పరిచయం చేసింది. మెసేజ్‌లు డిజప్పియర్ కాకుండా ఉండేందుకు ‘కెప్ట్ మెసేజెస్’ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కెప్ట్ మెసేజెస్ అప్ డేట్ ద్వారా చాటింగ్ మెసేజెస్ అన్నీ ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెప్ట్ మెసేజ్ అనే ఫీచర్ చాట్ ఇన్ ఫో లిస్ట్ లో అందుబాటులో ఉంది. కెప్ట్ మెసేజులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఉండే మెసేజ్ లు ఎప్పటికీ డిలీట్ కావు. ఒక వేళ సదరు మెసేజ్ లను డిలీట్ చేయాలనుకుంటే ఈజీగా డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ‘అన్ కీప్’ అంటే సరిపోతుంది. ఎప్పుడైతే అన్ కీప్ క్లిక్ చేస్తారో, అప్పుడే ఆ మెసేజ్ లు పర్మినెంట్ గా డిలీట్ అవుతాయి.
తాజాగా ఈ ఫీచర్ కు సంబంధించిన వివరాలను వాట్సాప్ ఇన్ఫో సైట్ WABetaInfo వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు చెప్పింది. ఆండ్రాయిడ్ 2.23.4.10 అప్ డేట్ కోసం వాట్సాప్ బీటాను ఇన్ స్టాల్ చేసి, కొంత మంది బీటా టెస్టర్లతో పరీక్షిస్తున్నట్లు వివరించింది. వాట్సాప్ అకౌంట్ ఫీచర్ అందుబాటులో ఉంటే చాట్ ఇన్ఫోలో కెప్ట్ మెసేజెస్ అని కనిపిస్తుంది. ఇందులో ఎవరైనా డిసప్పియర్ మెసేజ్ ఉంచితే, డిలీట్ కాకుండా ఉంటుంది. కెప్ట్ మెసేజెస్ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలంటే, గ్రూప్ చాట్‌ని ఓపెన్ చేసి, గ్రూప్ నేమ్‌పై ట్యాప్ చేస్తే ‘కెప్ట్ మెసేజెస్’ అనే సెక్షన్ కనిపిస్తుంది.
ఇక ఈ లేటెస్ట్ కెప్ట్ మెసేజెస్ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ లేటెస్ట్ (v2.23.4.10) వెర్షన్ లో సెలెక్టెడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ ఫీచర్ త్వరలో పూర్తి చేసుకుని అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు వాట్సాప్ తెలిపింది. మరోవైపు కెప్ట్ ఫీచర్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకున్న స్టార్డ్ మెసేజెస్ ఫీచర్ నిరుపయోగం కానుంది. ఈ నేపథ్యంలో స్టార్డ్ మెసేజెస్ ఫీచర్ ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా వాట్సాప్ పలు ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో వాట్సాప్ కాలింగ్ షార్ట్ కట్స్ ఒకటి. ఈ లేటెస్ట్ ఫీచర్ తో వినియోగదారులు కాలింగ్ షార్ట్ కట్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం కాంటాక్ట్స్ జాబితాలోని పేరుపై ప్రెస్ చేయడం ద్వారా ఈజీగా కాల్ వెళ్తుంది. ఒకే వ్యక్తికి కాల్ చేసిన ప్రతిసారి పేరు సెర్చ్ చేయకుండా ఈ ఫీచర్ ద్వారా షార్ట్ కట్‌ను పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులకు టైమ్ సేవ్ కావడంతో పాటు కాంటాక్ట్స్ ను వెతికే శ్రమ తగ్గనుంది.
Read Also: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!
వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు