JioBharat 4G: వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ - రూ.700కే 4జీ ఫోన్!
JioBharat 4G Diwali Offer: జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ను కేవలం రూ.699కే కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. ఇందులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
Mukesh Ambani Reliance Jio Diwali Offer: మరికొద్ది రోజుల్లో దేశంలో దీపావళి పండుగ రాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ కస్టమర్లకు రకరకాల ఆఫర్లను అందజేస్తున్నాయి. అలాగే రిలయన్స్ జియో యజమాని ముకేష్ అంబానీ తన వినియోగదారుల కోసం గొప్ప దీపావళి ధమాకా ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పుడు ప్రజలు జియో 4జీ ఫోన్‌ను రూ. 700 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు.
జియో దీపావళి ఆఫర్
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో తన జియో భారత్ ఫోన్‌పై 30 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా రూ. 999 విలువైన జియో భారత్ ఫోన్‌ను కేవలం 699 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
జియో భారత్ ఫోన్‌ను కూడా రూ. 123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్‌తో పాటు 14 జీబీ డేటా కూడా లభించనుంది. ఇది నెలవారీ రీఛార్జ్ ప్లాన్. రిలయన్స్ జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ రీఛార్జ్ ప్లాన్ల కంటే 40 శాతం తక్కువ. ఈ రిలయన్స్ జియో ఫోన్‌తో మీరు 2జీ నుంచి 4జీకి మారే అవకాశాన్ని పొందుతారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
జియో భారత్ ఫీచర్లు ఇవే...
ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఫోన్‌లో 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. అలాగే ఫోన్‌లో సినిమా ప్రీమియర్‌లు, కొత్త సినిమాలు, వీడియో షోలు, లైవ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లు, డిజిటల్ చెల్లింపులు వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే మీరు ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే సదుపాయాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్ జియోపే, జియాఛాట్ వంటి ప్రీలోడెడ్ యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ రిలయన్స్ జియో ఫోన్‌ను స్టోర్‌తో పాటు జియోమార్ట్, ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
Shri Mukesh Ambani in a fireside chat with Mr. Jensen Huang, NVIDIA CEO, talks about India's rise as the global leader in data usage and Jio's pivotal role in creating value for 1.4 billion Indians.#DigitalIndia #JioRevolution #DataForAll #Jio #India #AI #Reliance #NVIDIA… pic.twitter.com/uB1si7qBIP
— Reliance Jio (@reliancejio) October 24, 2024
Step into the future of wellness with JioGlass and YogiFi! Enjoy immersive yoga sessions with JioGlass while YogiFi's Al mat provides real-time feedback on your posture and balance. Elevate your practice effortlessly!#JioGlass #Yogifi #FutureOfYoga #AlYoga #ImmersiveWellness… pic.twitter.com/0CgAe6GUUn
— Reliance Jio (@reliancejio) October 23, 2024