Jio New Plan: బెస్ట్ ప్లాన్‌ను నిలిపివేస్తున్న జియో - అసలు అది ఏ ప్లాన్? వ్యాలిడిటీ ఎంత?
Jio Rs 2025 Plan: భారతదేశ నంబర్ వన్ టెలికాం బ్రాండ్ రిలయన్స్ జియో తన రూ.2025 ప్లాన్‌ను డిస్‌కంటిన్యూ చేసింది. జనవరి 11వ తేదీ తర్వాత ఈ ప్లాన్ అందుబాటులో ఉండబోదు.

Jio Rs 2025 Plan: మీరు రిలయన్స్ జియో నంబర్‌ను ఉపయోగిస్తుంటే ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించిన ప్రత్యేక ప్లాన్‌ను కంపెనీ ఇప్పుడు నిలిపివేయబోతోంది. వాస్తవానికి జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ను నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించింది. ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ ప్లాన్. ఇప్పుడు ఆ సమయం కూడా ముగియబోతోంది. కాబట్టి జనవరి 11వ తేదీన కంపెనీ ఈ ప్లాన్‌ను మూసివేస్తుంది. మీరు దానికి ముందే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు రెండు రోజుల సమయం ఉంది.
200 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌ను 2024 డిసెంబర్ 11వ తేదీన ప్రారంభించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్‌ను ఒక నెల పాటు తీసుకువచ్చారు. రూ. 2025 ప్లాన్‌లో కస్టమర్‌లు 200 రోజుల వ్యాలిడిటీ, 500 జీబీ డేటాను పొందుతారు. ఇది జియో మొదటి రీఛార్జ్ ప్లాన్. ఇందులో ఆరు నెలల కంటే ఎక్కువ వ్యాలిడిటీ లభిస్తుంది. వాలిడిటీ కోసం మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయడంలో విసిగిపోయిన కస్టమర్లకు ఇది మంచి ఆప్షన్.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
ప్రతిరోజూ అందుబాటులో 2.5 జీబీ డేటా
జియో ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు 500 జీబీ డేటాను అందిస్తుంది. అంటే కస్టమర్లకు రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుందన్న మాట. లాంగ్ వాలిడిటీ, 500 జీబీ డేటాతో పాటు జియో కస్టమర్లకు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లకు రూ. 500 అజియో కూపన్, రూ. 1,500 ఈజ్‌మైట్రిప్ కూపన్, రూ. 150 స్విగ్గీ కూపన్ కూడా లభిస్తాయి. అంటే కస్టమర్లు ఈ ప్లాన్ కోసం చెల్లించే మొత్తం కంటే ఎక్కువ విలువైన కూపన్‌లను పొందుతున్నారు.
ప్రారంభించాక సరిగ్గా ఒక నెల తర్వాత కంపెనీ ఈ ప్లాన్‌ను నిలిపివేస్తోంది. జనవరి 11వ తేదీ తర్వాత ఈ ప్లాన్ అందుబాటులో ఉండబోదు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, జనవరి 11వ తేదీలోపు ఈ రీఛార్జ్‌ను చేసుకోండి.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
Secure every conversation with JioSafe - protects your voice and video calls with advanced encryption and ensures your privacy every step of the way.https://t.co/RCLdKD4mW4#JioSafe #SecureCommunication #QuantumSecure #EndToEndEncryption #WithLoveFromJio pic.twitter.com/2cFQ3kNUz9
— Reliance Jio (@reliancejio) January 2, 2025
Forget the worry of losing things and travel smart with JioTag Go! 😎✈️🧳
— Reliance Jio (@reliancejio) December 24, 2024
The must-have travel essential for stress-free adventures.
Tag it. Track it Everywhere! 💯
🎥: Instagram/kalash.rajvanshhttps://t.co/sd7vn9ViBm#JioTagGo #TravelSmart #Track #TravelHack pic.twitter.com/bBVJmPSym1
Experience AI magic with JioCloud! From auto-organized albums to theme-based photo edits that match your vibe, JioCloud simplifies and personalizes your digital life.
— Reliance Jio (@reliancejio) December 20, 2024
Stay tuned – the magic is launching soon! #JioCloud #WithLoveFromJio #DigitalLife pic.twitter.com/qzCINDe29A




















