Jio Cinema Annual Plan: దేశంలో బెస్ట్ ఓటీటీ ప్లాన్ ఇదే - రూ.299కే సంవత్సరం పాటు!
Jio Cinema Premium Subscription: జియో సినిమా యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.299 ప్లాన్‌గా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాన్లలో ఇదే బెస్ట్ అనుకోవచ్చు.
Jio Cinema Premium New Plan: జియో సినిమా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ సైలెంట్‌గా లాంచ్ అయింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను జియో ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకుంటే యాడ్లు లేకుండా యాప్‌లో ఉన్న 4కే కంటెంట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యర్థి ఓటీటీ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేవలం రూ.299కే సంవత్సరం పాటు ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేసే ప్లాన్‌ను జియో లాంచ్ చేసింది.
ఈ వార్షిక ప్లాన్ ధరను కంపెనీ రూ.599గా వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద దీన్ని 50 శాతం డిస్కౌంట్‌తో దీన్ని రూ.299కే అందిస్తుంది. మొదటి 12 నెలల సబ్‌స్క్రిప్షన్ అయిపోయాక రూ.299తో రెన్యువల్ అవుతుంది.
కంపెనీ వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... ప్రీమియం వార్షిక ప్లాన్‌లో యాడ్ ఫ్రీ కంటెంట్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. హెచ్‌బీవో, పారామౌంట్, పీకాక్, వార్నర్ బ్రోస్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌజులు, ఓటీటీ ప్లాట్‌ఫాంలకు సంబంధించిన కంటెంట్ ఇందులో లభించనుంది. యూజర్స్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం జియో సినిమా అందిస్తున్న మూడు ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాన్లలోనూ యాడ్ ఫ్రీ కంటెంట్‌ను అందిస్తున్నారు. ఐపీఎల్, ఇతర స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్‌లో మాత్రం యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
ప్రస్తుతం జియో సినిమా అందిస్తున్న రూ.299 ప్లాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న అన్ని ఓటీటీ ప్లాన్లలో బెస్ట్ అని చెప్పవచ్చు. ఒకవేళ వార్షిక ప్లాన్ ఎక్కువ అనుకుంటే రూ.29 నెలవారీ ప్లాన్ తీసుకోవచ్చు. రూ.299 ప్లాన్‌తో ఏ లాభాలు లభిస్తాయో రూ.29 ప్లాన్‌తో కూడా అవే లాభాలను అందుకోవచ్చు. కానీ వ్యాలిడిటీ మాత్రం నెల మాత్రమే ఉండనుంది.
దీంతో పాటు జియో ప్రస్తుతం రూ.89 ప్లాన్ కూడా అందిస్తుంది. ఇది కూడా నెలవారీ ప్లాన్. కానీ ఈ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాలుగు డివైస్‌ల్లో ఒకేసారి స్ట్రీమ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌కు ఫ్యామిలీ ప్లాన్ అని పేరు పెట్టారు. ఫ్యామిలీ ప్లాన్‌లో యాన్యువల్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోల కంటే దీని ధర చాలా తక్కువ. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్ నెలవారీ ధర రూ.149 కాగా, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ధర రూ.299 నుంచి ప్రారంభం కానుంది. వీటి వార్షిక ప్లాన్ ధర రూ.1,499గా ఉంది.
BIG:
— Tanay Singh Thakur (@TanaysinghT) May 26, 2024
JioCinema Premium Yearly Plan at 50% Discount:
Cost right now - Rs 299 for 1 year!
Monthly plans at - Rs 29 (for individual) and Rs 89 (for family) #JioCinema pic.twitter.com/EKmH2y6awf
Read Also: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్, పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టినా ఇబ్బందేమీ లేదు!