Itel S24: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఐటెల్ కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Itel New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్24.
Itel S24 Launched: ఐటెల్ ఎస్24 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కలర్ ఛేంజింగ్ ఫొటోక్రొమాటిక్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. దీని బ్యాక్ ప్యానెల్ కలర్ ఛేంజెస్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఐటెల్ ఎస్24 ధర (Itel S24 Price in India)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ కాగా, దీంతోపాటు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. బ్లూ, డాన్ వైట్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ డేట్, ధర వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?
ఐటెల్ ఎస్24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Itel S24 Specifications)
ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 480 నిట్స్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ91 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఐటెల్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఐటెల్ ఎస్24 పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు క్యూవీజీఏ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
ఫ్రంట్ కెమెరా కటౌట్ చుట్టూ డైనమిక్ బార్ ఫీచర్ అందుబాటులో ఉంది. బ్యాటరీ డిటైల్స్, ఇన్‌కమింగ్ కాల్ అలెర్ట్స్ వంటి ముఖ్యమైన నోటిఫికేషన్లు ఇందులో చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 40 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కనుంది. 4జీ, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
మరోవైపు ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. ఆక్టాకోర్ డైమెన్సిటీ ప్రాసెసర్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందు ఉన్నాయి. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు చూడవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందించనుంది. కొనుగోలు చేసిన 100 రోజుల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తున్నారు.
Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?