By: ABP Desam | Updated at : 17 Mar 2022 05:01 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
iQoo_Z6_5G
ఐకూ జెడ్6 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ, వివో టీ1 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ52లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
ఐకూ జెడ్6 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా... 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999గానూ, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గానూ నిర్ణయించారు. మార్చి 22వ తేదీ నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపును దీనిపై అందించనున్నారు. అంటే ప్రారంభ వేరియంట్‌ను రూ.13,499కే కొనేయచ్చన్న మాట.
ఐకూ జెడ్6 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 187 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
Realme New Tablet: రియల్మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?