iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
iPhone 17 Series: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి.
Apple New Phone: ఐఫోన్ 17 స్లిమ్ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఉన్న లైనప్‌లో దీన్ని యాడ్ చేస్తారా? లేక ఏదైనా మోడల్‌ను తీసేసి దాని ప్లేస్‌లో తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో యాపిల్ నాలుగు మోడల్స్‌ను ఫిక్స్‌డ్‌గా లాంచ్ చేస్తుంది. ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మొబైల్స్ ఈ సిరీస్‌లో ఉన్నాయి. ప్రస్తుతం యాపిల్ లైనప్‌లో ఉన్న అన్ని ఫోన్ల కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. అంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (ఒకవేళ లాంచ్ అయితే) కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందన్న మాట.
జీఎస్ఎంఎరీనా కథనం ప్రకారం యాపిల్ తన ఐఫోన్ 17 స్లిమ్ మోడల్‌ను 2025లో లాంచ్ చేయనుంది. 2024 సెప్టెంబర్‌లో యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఐఫోన్ తన ప్లస్ మోడల్‌ను లైనప్‌లో ఉంచుతుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఐఫోన్ 13 మినీ స్థానంలో ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 ప్లస్‌ను యాపిల్ లాంచ్ చేసింది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు
యాపిల్ 2025లో లాంచ్ చేయనున్న అన్ని ఫోన్లలో ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే ఐఫోన్ 17 స్లిమ్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. ఈ నెల ప్రారంభంలో ఐప్యాడ్ ప్రో (2024)ను కంపెనీ లాంచ్ చేసింది. దీని ముందు వెర్షన్ కంటే ఈ మోడల్ చాలా సన్నగా ఉంది.
ఐఫోన్ 17 స్లిమ్ డిజైన్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఫోన్ వెనకవైపు మధ్యలో యాపిల్ కెమెరా సెటప్‌ను అందిస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన లీకుల ప్రకారం ఐఫోన్ 17 సిరీస్‌లో డైనమిక్ ఐల్యాండ్ సైజు మరింత తగ్గనుంది. ఐఫోన్ 17 స్లిమ్ స్క్రీన్ సైజు 6.6 అంగుళాలుగా ఉండనుందని సమాచారం. ఐఫోన్ 17లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాలు, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్లన్నీ నిజమో కాదో తెలియాలంటే 2025 సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
ఐఫోన్ 16 సిరీస్‌కు సంబంధించి కొన్ని డమ్మీ ఇమేజెస్ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే ఐఫోన్ 16లో చాలా మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్ ఫోన్లలో కొత్తగా డిజైన్ చేసిన డైనమిక్ ఐలాండ్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ప్రో మోడల్స్ డిస్ ప్లే సైజుని పెంచాలని యాపిల్ అనుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఐఫోన్ 16 సిరీస్ మినిమల్ బెజెల్స్‌తో, ఎక్కువ స్క్రీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుందని లీకులను బట్టి తెలుసుకోవచ్చు.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది