News
News
X

iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!

ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది.

FOLLOW US: 
Share:

iPhone 15 Series: యాపిల్ గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్ గురించిన లీకులు కూడా వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు లీకయ్యాయి.

లీకైన ఫీచర్ల ప్రకారం... ఐఫోన్ 15లో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను అందించనున్నారు. డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఈసారి ఈ మోడల్స్‌లో కూడా అందించనున్నారు. 2.5డీ గ్లాస్‌తో కొత్త తరహా డిజైన్ అందించనున్నారు.

48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఇందులో ఉండనున్నాయి. బయోనిక్ ఏ16 ప్రాసెసర్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ పని చేయనున్నాయి. 6 జీబీ ర్యామ్ అందించనున్నారు. లైట్‌నింగ్ పోర్టు బదులుగా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. ఛార్జింగ్ స్పీడ్ మాత్రం లైట్‌నింగ్ తరహాలోనే ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేస్తే... ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి.

ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే... వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో ప్రధాన సెన్సార్‌గా అందించారు.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. ఇందులో పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Published at : 25 Feb 2023 05:27 PM (IST) Tags: iPhone 15 Series iPhone 15 iPhone 15 Pro iPhone 15 Series Leak iPhone 15 Leak iPhone 15 Plus iPhone 15 Pro Max

సంబంధిత కథనాలు

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు,  జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

WhatsApp: మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Best Drones: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

Apple iPhone 12 Mini: రూ.22 వేలకే Apple iPhone 12 Mini కొనుగోలు చెయ్యొచ్చు, ఎలాగో తెలుసా?

C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు కూడా అదుర్స్

C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌, ఫీచర్లు కూడా అదుర్స్

iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?

iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్